Kalyan Dev: కళ్యాణ్ దేవ్ గురించి ఈ షాకింగ్ నిజాలు మీకు తెలుసా?

Kalyan Dev: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ డంని సొంతం చేసుకున్న ఫ్యామిలీ మెగాస్టార్ ఫ్యామిలీ. తెలుగులో ఏ హీరోకు సాధ్యం కాని ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న స్టార్ మెగాస్టార్ చిరంజీవి. అలాంటి చిరంజీవి తన రెండో కూతురు శ్రీజ విషయంలో బాధపడుతున్నాడట. శ్రీజకు కళ్యాణ్ దేవ్ తో పెళ్లి చేసిన చిరంజీవి.. ఇప్పుడు వారు విడిపోతుండటంతో బాధపడుతున్నట్లు సమాచారం.

 

చిరంజీవి కుటుంబానికి సంబంధించిన ఈ విషయాన్ని సీనియర్ జర్నలిస్ట్ ఈమంది రామారావు వివరించారు. చిరంజీవి కూతురు శ్రీజ.. ఇంట్లో నుండి వెళ్లిపోయి శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తెలిసిందే. ఓ బిడ్డను కన్న తర్వాత శ్రీజ, శ్రీకాంత్ లు విడిపోగా.. శ్రీజకు నాలుగేళ్ల క్రితం కళ్యాణ్ దేవ్ తో చిరంజీవి పెళ్లి చేశాడు. అయితే ఇప్పుడు వీరు కూడా విడిపోయేలా ఉన్నారని సీనియర్ జర్నలిస్ట్ ఈమంది రామారావు తెలిపారు.

 

కళ్యాణ్ దేవ్.. చిరంజీవి, మెగా ఫ్యాన్స్ ని అడ్డం పెట్టుకొని హీరోగా ఎదగాలనే ఉద్దేశంతోనే శ్రీజను పెళ్లి చేసుకున్నట్లు ఈమంది రామారావు ఆరోపించారు. శ్రీజను కళ్యాణ్ దేవ్ ఓ రకంగా వాడుకొని, వదిలేస్తున్నాడని ఆయన అన్నారు. మెగా ఫ్యామిలీకి అల్లుడైతే సినిమా అవకాశాలు వస్తాయని, ఈ రకంగా తాను హీరోగా ఎదగడానికి వీలవుతుందనే ఇలా చేసినట్లు ఆయన వివరించారు.

 

ఇప్పటికే శ్రీజ, కళ్యాణ్ దేవ్ లు విడివిడిగా ఉంటుండగా.. వీరిద్దరు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో శ్రీజకు మూడో పెళ్లి చేయడానికి చిరంజీవి చూస్తున్నారని.. ఇందుకోసం కొన్ని కండీషన్లు కూడా పెట్టినట్లు ఈమంది రామారావు వెల్లడించారు. శ్రీజకు కాబోయే భర్తకు ఆస్తి లేకపోయినా పర్వాలేదు కానీ తన బిడ్డను మాత్రం బాగా చూసుకుంటే చాలు అని చిరంజీవి భావిస్తున్నాడట. మరి ఈ వ్యవహారం ఎక్కడి వరకు వస్తుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత ఇలాకాలోనే జగన్ కు మైండ్ బ్లాంక్ అయ్యే షాక్.. వందల బస్సులు పెట్టి తరలించినా జనం లేరుగా!

YS Jagan: మనుషులు లేకపోయినా అభివాదం చేయడం.. కష్టంలో ఉన్నవారి దగ్గరకు వెళ్లి అక్కడ కూడా మనస్పూర్తిగా నవ్వడం ఏపీ సీఎం జగన్‌లోనే చూడొచ్చు. ఈ మధ్య ఓ రీల్ బాగా గ్రెండ్...
- Advertisement -
- Advertisement -