Megastar: మెగాస్టార్ తాత గురించి ఈ షాకింగ్ విషయాలు తెలుసా?

Megastar: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ పెద్ద అని ఎవ్వరైనా చెబుతారు. టాలీవుడ్ లో ఆయన తిరుగులేని స్టార్ హీరోగా ఉన్నారు. చిరంజీవి పుట్టిన ఊరు పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు కావడం విశేషం. మొగల్తూరులో ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా చిరంజీవి అందరికీ సుపరిచితుడే. నేడు ఆయన తెలుగు ప్రజల హృదయాల్లో తిరుగులేని మెగాస్టార్ గా రాజ్యమేలుతున్నాడు. మెగస్టార్ చిరంజీవి స్వస్థలం దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు స్వస్థలం ఒకటే కావడం విశేషంగా చెప్పొచ్చు.

గతంలో కృష్ణంరాజు నాన్న, తాతలు అటు చిరంజీవి నాన్న, తాతలకు సన్నిహిత సంబంధాలు ఉండటం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే చిరంజీవి కంటే ముందుగానే కృష్ణంరాజు హీరో అవ్వగా ఆ తర్వాత వెనకాలే చిరంజీవి కూడా సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టారు. నెమ్మదిగా పాత్రలో చేస్తూ తిరుగులేని మెగాస్టార్ గా మారారు. చిన్నతనంలో మెగాస్టార్ చిరంజీవి తాతగారు మొగల్తూరులో కనిపించిన వాళ్ళందరినీ ఎక్కువగా బూతులు తిడుతూ ఉండేవారని సమాచారం. సమయం సందర్భం లేకుండా బూతులు తిడుతూ ఉండడంతో చిరంజీవి తాతకు బూతుల నాయుడు అనే పేరు కూడా పెట్టారట.

ఊర్లో ఉండే వాళ్ళందరూ బూతులు నాయుడు బూతులు నాయుడు అని చిరంజీవి తాత‌ను ఆటపట్టిస్తూ సరదాగా ఉండేవారట. ఈ విషయాన్ని దివంగత కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. ఇక చిరంజీవి తాత అప్ప‌ట్లోనే ఓ చిన్న ప్ర‌భుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారని, అయితే ఆయ‌న‌కు కృష్ణంరాజు వాళ్లే మొగ‌ల్తూరు సంత‌లో చిన్న కొట్టు కేటాయించినట్లు తెలిపారు. ఆ త‌ర్వాత ఆయ‌న కుమారుడు వెంక‌ట్రావు కానిస్టేబుల్ అయ్యి పలు సేవా కార్యక్రమాలు కూడా చేశారట.

ఇక ఆ వెంక‌ట్రావు కుమారులే మెగాస్టార్ చిరంజీవి, నాగ‌బాబు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా సొంత ఊరు మొగ‌ల్తూరు అంటే వీరికి ఎంతో ప్రేమ ఉండటంతో అక్కడ అనేక కార్యక్రమాలు చేస్తూ ఊరి ప్రజలకు దగ్గరగానే ఉండేవారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ కార్పొరేట్ విద్య అంటే ఇదేనా.. ఏకంగా ఇంత చేశారా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలలను కార్పొరేటర్ విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దామని నాడు నీడలో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా కార్పొరేట్ స్థాయిలో ఉన్నత చదువులు చదువుతున్నారు...
- Advertisement -
- Advertisement -