Pavitra Lokesh: పవిత్ర లోకేశ్ గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

Pavitra Lokesh: తెలుగు సినిమాల్లో నటించే ప్రతి ఒక్క ఆర్టిస్టును జనాలు బాగా గుర్తించుకుంటారు. మరీ ముఖ్యంగా హీరో లేదంటే హీరో చుట్టూ ఉండే క్యారెక్టర్లకు సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి అలాంటి క్యారెక్టర్లను, ఆ క్యారెక్టర్లు చేేసే వాళ్లను గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఇదే కోవలో తెలుగులో బాగా ఫేమస్ అయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేశ్. నిజానికి ఈమె ఈ మధ్యన సినిమాల కన్నా వివాదాల వల్ల ఎక్కువ పాపులర్ అయిందని చెప్పుకోవాలి.

టాలీవుడ్ లో చాలా సినిమాల్లో తల్లిగా, అక్కగా, అత్తగా, వదినగా, రకరకాల పాత్రలు చేసింది పవిత్రా లోకేశ్. మలయాళం నుండి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి సెటిల్ అయిన పవిత్రా లోకేశ్.. నటుడు నరేష్ తో రిలేషన్ షిప్ లో ఉండటం పెద్ద దుమారమే రేగింది. వీరిద్దరు ఒక బాబా వద్దకు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. వీరిద్దరు ఒకే హోటల్ రూంలో ఉన్నప్పుడు నరేష్ మూడో భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం సంచలనం రేపింది.

ఇక టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన పాత్రలను పోషించే స్థాయికి ఎదిగిన పవిత్రా లోకేశ్ కు గతంలోనే పెళ్లి అయింది. ప్రస్తుతం ఈమె తెలుగులో సినిమాలు చేస్తూ, హైదరాబాద్ లోనే నరేష్ తో కలిసి ఉంటోంది. ఈమెకు సంబంధించిన ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుండగా.. ఆమె తాజాగా ఓ కన్నడ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన జీవితంలో జరిగిన ఓ ఘటన గురించి పవిత్రా లోకేశ్ వివరించింది.

కెరీర్ ప్రారంభంలో తాను ఎన్నో కష్టాలను చూశానని చెప్పుకొచ్చిన పవిత్రా లోకేశ్.. అప్పట్లో అవకాశాలు వస్తే భయమేసేదని చెప్పింది. ఇప్పుడు పర్వాలేదు కానీ ఒకప్పుడు నాకు అవకాశాలు ఇచ్చేవాళ్లను చూస్తుంటే భయం వేసేద‌ని తెలిపింది. తనకు ఆఫర్ ఇచ్చినందుకు ఏం కోరుకుంటున్నారోన‌ని టెన్షన్ పడేదాన్ని అని పవిత్రా లోకేశ్ వివరించింది. అలాగే గతంలో తనను ఓ స్టార్ హీరో వాడుకుని వదిలేశాడని చెప్పింది. అయితే సదరు హీరో పేరు మాత్రం పవిత్రా లోకేశ్ బయటపెట్టలేదు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -