Prabhas: ప్రభాస్ బలహీనత గురించి ఈ షాకింగ్ విషయాలు తెలుసా?

Prabhas: ఈ రోజుల్లో ఎవ్వర్నీ ఎవ్వరూ నమ్మడం లేదు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో అయితే ఇది సాధ్యపడదు. అయితే ఒక స్టార్ హీరోను నమ్మి వేర్వేరు నిర్మాతలు కలిసి రూ.3000 కోట్లు బడ్జెట్ పెట్టాలనుకుంటున్నారంటే అది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కే సాధ్యం అని చెప్పొచ్చు. టాలీవుడ్ లో చాలా మంది దర్శక నిర్మాతలు ఉన్నారు. అయితే ప్రభాస్ ను నిర్మాతలు నమ్మినంతగా మరే హీరోను కొందరు నిర్మాతలు నమ్మరు.

 

ప్రభాస్ సినిమాల బిజినెస్ సాఫీగా సాగుతోంది. ఆయనకు ఫ్లాప్ లు వచ్చినా కూడా అవి ఆయన కెరీర్ పై అంతగా ప్రభావం చూపడం లేదు. పాజిటివ్ టాక్ వస్తే ప్రభాస్ ఏ రేంజ్ లో రికార్డులు సృష్టిస్తారో సలార్ సినిమాతో ప్రూవ్ అవుతుందని ప్రభాస్ అభిమానులు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.

 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ప్రభాస్ కు అత్యంత సన్నిహితులలో ఒకరైన ప్రభాస్ శ్రీను పలు కీలక విషయాలు చెప్పుకొచ్చారు. నీళ్లంటే తనకు చాలా భయమని ప్రభాస్ శ్రీను చెప్పడం విశేషం. తనకు ఈత వచ్చని అయినప్పటికీ నీళ్లు అంటే చాలా భయమని, తాను రోజూ డ్రింక్ చేస్తానని ప్రభాస్ శ్రీను తెలిపారు.

 

జూనియర్ ఎన్టీఆర్ తో తనకు మంచి స్నేహం ఉందని, తానెప్పుడూ పాంపరింగ్ చేయనని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చాడు. కమెడియన్ బ్రహ్మానందం టాలెంట్ ఉండేవారిని ఎంకరేజ్ చేస్తారని తెలిపారు. విక్రమార్కుడు సినిమాలో తనకు మంచి పాత్ర ఇచ్చారని, ఆ సినిమాలో నిజంగానే దెబ్బలు తిన్నానని అన్నారు. ప్రభాస్ ను నమ్మి నిర్మాతలు ఇప్పటికీ ముందుకు వస్తున్నారని, ప్రభాస్ కెరీర్ కు ఎటువంటి డోకా లేదని తెలిపారు. ప్రభాస్ తన ఫ్రెండ్ కావడం వల్లే తాను ఇండస్ట్రీలో ఎదుగుతున్నాని తెలిపారు. ఎవరినైనా నమ్మేయడం ప్రభాస్ బలహీనత అని ఆయన చెప్పుకొచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Janasena: ఏపీలోని 21 అసెంబ్లీ స్థానాలలో జనసేన పరిస్థితి ఇదీ.. అన్ని స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందా?

Janasena: మే 13వ తేదీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీ 21 స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా జనసేన పోటీ చేస్తున్నటువంటి ఈ స్థానాల విషయంలో...
- Advertisement -
- Advertisement -