Kantara: కాంతార హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

Kantara: సత్తా ఉంటే ఇండస్ట్రీలో రెప్పపాటులో విజయం సాధించవచ్చని నిరూపించిన వారిలో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి ఒకరు. 12 ఏళ్ల సినీ ప్రయాణంలో ఒకే సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ‘కాంతార’ సినిమాలో రిషబ్ శెట్టి దర్శకత్వం, హీరోగా యాక్టింగ్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ భాషా చిత్రాల్లో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడూ సౌత్ ఇండియా స్టార్ హీరోలు కూడా తనతో పని చేయాలని కోరుకుంటున్నారు.

 

రిషబ్ శెట్టి అసలు ఇండస్ట్రీకే పరిచయం లేని వ్యక్తి. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి ఎంతో కష్టపడ్డారు. ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్న వారి సరసన నిలుస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే రిషబ్ శెట్టి పేరు బాలీవుడ్‌లోనూ మార్మోగుతోంది. అయితే ఆ స్థాయికి రావడానికి రిషబ్ శెట్టికి 18 ఏళ్లు పట్టిందట. కాలేజీ చదువుకునే రోజుల్లోనే నటుడిగా రాణించాలని అనుకున్నారట. ఓ వైపు చదువుకుంటూ.. మరో వైపు వాటర్ బాటిళ్లు అమ్ముతూ.. హోటళ్లలో పని చేసేవాడట. తన కలను నెరవేర్చుకోవాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. కెరీర్ ప్రారంభంలో నాటకాల్లో నటించిన రిషబ్‌కు.. 2004లో సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ‘నామ్ ఏరియాలి ఒండినా’ సినిమాలో నటించినప్పుడు అతడి పాత్రకు పేరు కూడా లేదు. అలా చాలా వరకు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు.

 

ఓ ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి తన పోరాట గాథను చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఇండస్ట్రీలోకి వచ్చి 18 ఏళ్లు అయింది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. డైరెక్షన్‌లో మెళకువలు నేర్చుకుంటూ.. కొన్ని సినిమాలు చేశాను. అలాగే కొన్ని సినిమాల్లో కూడా నటించాను. 2019లో లీడ్ హీరోగా నటించాను. ‘బెల్ బాటమ్’ సినిమాలో హీరోగా నటించాను. ఆ తర్వాత కాంతార స్టోరీ రాస్తున్నప్పుడు డైరెక్షన్, హీరోగా నేనే నటించాలని అనుకున్నాను. కన్నడలోనే సినిమాను తీయాలని అనుకున్నా.. కానీ సినిమాకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. దీంతో తెలుగు, హిందీ భాషల్లో డబ్బింగ్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమా ఇంత హిట్ అవుతుందని, పాన్ ఇండియా స్టార్‌ను చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదు.’ అని పేర్కొన్నాడు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -