Jr NTR: తారక్ పెళ్లి జరగడం వెనుక ఇంత తతంగం జరిగిందా?

Jr NTR: తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటుడిగా, రాజకీయ నాయకుడిగా అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఆయన నటవారసులుగా బాలయ్య బాబు, హరికృష్ణలు చిత్ర పరిశ్రమకి పరిచయమయ్యారు. బాలయ్య బాబు చిన్నతనంలోనే నందమూరి తారక రామారావుతో కలిసి పలు సినిమాల్లో నటించారు. అంతేకాదు.. హీరోగా తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తండ్రి బాటలోనే రాజకీయ నాయకుడిగా కూడా రాణిస్తున్నారు. అలాగే హీరో హరికృష్ణ నలభై ఏళ్ల వయస్సులో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. ఆయన నటించిన సినిమాలు తొమ్మిదే అయినప్పటికీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు.

హరికృష్ణ కొడుకులు కూడా ఇండస్ట్రీకి సుపరిచితమే. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. వారి నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తాత అస్థిత్వాన్ని కాపాడుతూ తాతకు తగ్గ మనవడిగా రాణిస్తున్నాడు. డైలాగులు చెప్పడంలోనూ, డాన్స్ చేయడంలోనూ ఆయనకు ఆయనే సాటి. జూనియర్ ఎన్టీఆర్ తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ఎన్టీఆర్ ‘నిన్ను చూడాలని’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

వివి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆది’ సినిమాతో మాస్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ’ వంటి సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘బృందావనం, అదుర్స్’ సినిమాలతో ఫ్యామిలీ ప్రేక్షకులను అలరించాడు. ఇక ఈ మధ్యకాలంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో ఎన్టీఆర్ రేంజే మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన పెద్దలు కుదురించిన వివాహం చేసుకున్నాడు. ఎన్టీఆర్ పెళ్లి చూపులు జరిగినప్పటికీ ప్రణతి మైనర్‌గా ఉన్నారు. ఆమె కోసం ఎన్టీఆర్ మూడు సంవత్సరాలు వెయిట్ చేసి వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఇద్దరు సంతానం. అయితే లక్ష్మీ ప్రణతి పెళ్లికి ముందే తారక్‌కు కండీషన్లు పెట్టడంతో పాటు పెళ్లి తర్వాత తన లైఫ్ ఎలా ఉండాలని అనుకుందో ముందుగానే డిసైడ్ అయిందని సమాచారం.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -