Top 3 Moments: ఎవరూ ఊహించని క్రికెట్ ఘట్టాలు మూడింటి గురించి తెలుసా?

Top 3 Moments: ఎక్కువ మంది అభిమానించే ఆటల జాబితాలో క్రికెట్ కు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. మరీ ముఖ్యంగా ఇండియా క్రికెట్ కు మరింత కమర్షియల్ హంగులు పులుమి ఐపీఎల్ పేరుతో దానికి కొత్త రూపును తెచ్చింది. అయితే ఫార్మాట్ ఏదైనా కానీ చాలామంది క్రికెట్ అభిమానులు క్రికెట్ ను ఎంతో బాగా ఆస్వాదించడానికి ఇష్టపడుతుంటారు. ఏ బంతి వల్ల ఆట ఎలా మారుతుందో, ఏ క్రికెటర్ ఎలా ఆడతాడో తెలియని అద్భుతమైన సందర్భాలు ఎన్నో క్రికెట్లో నిత్యం ఉంటాయి.

 

 

అందుకే చాలామంది అద్భుతాలను మిస్ కాకుండా క్రికెట్ మ్యాచ్ అంటే చాలు పడిచస్తుంటారు. అయితే క్రికెట్ చరిత్రలో కొన్ని స్పెషల్ ఘట్టాలు ఇప్పటికీ చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అస్సలు ఊహించని కొన్ని విషయాలను క్రికెట్ చరిత్రలో లిఖించబడినప్పుడు వాటిపట్ల కోట్ల మంది క్రికెట్ అభిమానులు ఆశ్చర్యంతో ఏం మాట్లాడక తెలియకుండా ఉండిపోయారు. ఈ ఆర్టికల్ లో అలాంటి అద్భుతమైన మూడు స్పెషల్ ఘట్టాల గురించి తెలుసుకుందాం.

 

లార్డ్స్ మైదానంలో అజిత్ అగార్కర్ చేసిన సెంచరీ:

క్రికెట్ ని ఓ మతంగా అభివర్ణిస్తే.. అందులో దేవుడిగా సచిన్ టెండూల్కర్ ని చాలామంది సంభోదిస్తుంటారు. అయితే ఆయన బ్యాట్ పట్టి క్రీజ్ లో దిగాడంటే రికార్డులు అతడి ముందు మోకరిల్లాల్సిందే. అలాంటి సచిన్ టెండూల్కర్ కల.. చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో సెంచరీ చేయాలనేది. కానీ మాస్టర్ వల్ల అది కుదరలేదు. కానీ 2002లో ఇంగ్లాండ్ తో లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ర అజిత్ అగార్కర్ మాత్రం సెంచరీ సాధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. లార్డ్స్ మైదానంలో అజిత్ అగార్కర్.. 190 బాల్స్ లో 109 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడం ఓ అరుదైన ఘట్టంగా చెప్పుకోవాలి.

 

రాహుల్ ద్రావిడ్ హైట్రిక్ సిక్సులు కొట్టడం:

క్రికెటర్లలో కొంతమందికి ఓ స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ కి అనుగుణంగానే వాళ్లు తమ ఆటను కొనసాగిస్తుంటారు. గ్రేట్ వాల్ గా టీమిండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ ద్రావిడ్.. క్రీజ్ లో పాతుకుపోయాడంటే అతడిని ఔట్ చేయడం ఎవరి తరం కాదనేది టాక్. అందుకే అతడు నిలదొక్కుకోకుండా బౌలర్లు విశ్వప్రయత్నం చేస్తుంటారు. టెస్ట్ క్రికెట్ లో అయితే రాహుల్ క్రీజ్ లో ఉంటే బౌలింగ్ చేసి చేసి బౌలర్ల చేతులకు నొప్పి పుట్టాల్సిందే. మిస్టర్ డిపెండబుల్ గా పేరున్న రాహుల్ ద్రావిడ్ బంతిని ఎలా విసిరినా దానిని ఆడతాడు.

రాహుల్ ద్రావిడ్ టెస్ట్ క్రికెట్ లో ఇలాంటి బ్యాటింగ్ తో అందరినీ ఆకట్టుకున్నా.. వన్డే మ్యాచుల్లో మరియు టీ20 మ్యాచుల్లో మాత్రం ఇది ఎంతమాత్రం సరిపోయేది కాదు. కానీ 2011లో టీమిండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడిన రాహుల్ ద్రావిడ్ అద్భుతం చేశాడు. కేవలం డిఫెన్స్ చేయడం మాత్రమే కాదు.. బంతిని బౌండరీలు దాటించే సత్తా తనలో ఉందని ద్రావిడ్ నిరూపించాడు. సమిత్ పటేల్ వేసిన ఓవర్ లో ఏకంగా మూడు హైట్రిక్ సిక్సులు కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. క్రికెట్ చరిత్రలో దీనిని ఓ స్పెషల్ ఘట్టంగా చాలామంది క్రికెట్ అభిమానులు అంటూ ఉంటారు.

 

గిల్ క్రిస్ట్ స్క్వాష్ బాల్ ట్రిక్:

వరల్డ్ కప్ లను గెలవడం అంటే ఆస్ట్రేలియాకు ఎంతో ఇష్టం. అందుకే వరుసగా వరల్డ్ కప్ లను సొంతం చేసుకోవడానికి ఎంత కష్టపడటానికైనా సిద్ధమవుతుంటుంది ఆస్ట్రేలియా. అయితే 2007 వరల్డ్ కప్ ని కూడా సొంతం చేసుకోవాలనుకున్న ఆస్ట్రేలియా శ్రీలంకను పోటీ నుండి తప్పించడం ద్వారా విజేతగా నిలిచింది. అయితే ఈ మ్యాచులో గిల్ క్రిస్ట్ ప్లాన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 281 పరుగులు చేయగా.. గిల్ క్రిస్ట్ ఒక్కడే 13 ఫోర్లు, 8 భారీ సిక్సులు కొట్టి 149 పరుగులు చేశాడు. ఇంత భారీ స్కోర్ చేయడం వెనక ఉన్న సీక్రెట్ ని గిల్ క్రిస్ట్ వెల్్లడించాడు. తన కోచ్ సలహా మేరకు ఎడమ చేతి గ్లౌజ్ లో స్క్వాష్ బాల్ పెట్టుకున్నానని.. ఇలా చేయడం వల్ల ఎడమ చేయి కింద భాగం వేగంగా కలుగుతుందని వెల్లడించాడు. క్రికెట్ చరిత్రలో మునుపెన్నడూ ఇలాంటిది చూడలేదు.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -