Prabhas: ఆస్కార్ హీరోలకు ప్రభాస్ ఇచ్చిన భారీ షాక్ ఏంటో తెలుసా?

Prabhas: ప్రతి నెలా ఓరమాక్స్ సర్వేకు సంబంధించిన ఫలితాలు వెల్లడవుతూ ఉంటాయి. అలా ఈ ఏడాది 2023 సంవత్సరం ఫిబ్రవరి నెల సర్వేకు సంబంధించిన ఫలితాలు తాజాగా విడుదల అయ్యాయి. ఈ జాబితాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నంబర్ వన్ స్థానంలో నిలిచారు. ప్రభాస్ వరుసగా నంబర్ వన్ స్థానంలో నిలుస్తుండటంతో ఏం చేస్తున్నారు. కాగా ప్రభాస్ నెంబర్ వన్ స్థానంలో నిలవగా జూనియర్ ఎన్టీఆర్ రెండవ స్థానంలో నిలిచారు. కాగా తారక్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలవడంతో పాటు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.

హీరో రామ్ చరణ్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. నాలుగవ స్థానంలో అల్లు అర్జున్ నిలిచారు. ప్రిన్స్ మహేష్ బాబు ఐదో స్థానంలో నిలిచారు. పవన్ కళ్యాణ్ ఈ జాబితాలో ఆరవ స్థానంలో నిలిచారు. ఇక న్యాచురల్ స్టార్ నాని ఈ జాబితాలో నాని ఏడో స్థానంలో నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచారు. మాస్ మహారాజ్ రవితేజ ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలవగా నందమూరి బాలకృష్ణ పదో స్థానంలో నిలిచారు. ఇక ఆ తర్వాత స్థానంలో విజయ్ దేవరకొండ నిలిచారు. అయితే నిన్న మొన్నటి వరకు జూనియర్ ఎన్టీఆర్ నెంబర్ వన్ హీరో అంటూ వార్తలు జోరుగా వినిపించిన సంగతి మనందరికీ తెలిసిందే.

 

కానీ తాజాగా విడుదల చేసిన ఫలితాలతో అభిమానులను అంచనాలు తారుమారు అయ్యాయి. అయితే ప్రతి సారి ప్రభాస్ మొదటి స్థానంలో నిలవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ నెంబర్ వన్ హీరో అంటూ సోషల్ మీడియాలో ప్రభాస్ పేరు హోరెత్తిస్తున్నారు. ఇతర హీరోలతో పోల్చుకుంటే ఏ హీరో చేతిలో లేనివిధంగా పాన్ ఇండియా ప్రాజెక్టులో ప్రభాస్ చేతిలో ఉన్న విషయం తెలిసిందే. దాదాపు నాలుగు ఐదు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు ప్రభాస్.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -