Health Tips: పసుపుపాలతో పాటు వాళ్ళు కలిపి తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Health Tips: ప్రస్తుత సమాజంలో చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరిని పట్టిపీడిస్తున్న సమస్యలలో డయాబెటిస్ సమస్య కూడా ఒకటి. రోజురోజుకి ఈ డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ డయాబెటిస్ ఇదివరకు రోజుల్లో కేవలం ముసలివారికి అలాగే వయసు మీద పడిన వారికి మాత్రమే వచ్చేది. కానీ రాను రాను మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవనశైలిలో మార్పులు రావడంతో పాటుగా ఆహారపు అలవాట్లలో మార్పులు రావడంతో షుగర్ వ్యాధి చిన్న వయసు వారికి వస్తోంది.

దీంతో రక్తంలోని షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం కోసం ఎంతో ఇష్టమైన తిండిని కూడా తినలేక చాలామంది అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. షుగర్ ఉన్నవారు ఎటువంటి పదార్థాలు తినాలి అన్న కూడా సంకోచిస్తూ ఉంటారు. కొంతమంది ఎటువంటి ఫుడ్స్ తినకబడినప్పటికీ రక్తంలో షుగర్ లెవెల్ ఎక్కువ అయిపోయి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వారు తరచూ మెడిసిన్స్ ఉపయోగించడంతోపాటు వంటింటి చిట్కాలను ఉపయోగించి కూడా రక్తంలోని షుగర్ లెవెల్స్ ని అందుబాటులో ఉంచుకోవచ్చు.

 

కాగా డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి అని దీనికి నివారణకు మందు లేదన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రక్తంలో షుగర్ అదుపులో ఉండాలి అంటే పాలతో పాటు కొన్ని కలిపి తీసుకోవడం వల్ల అదుపులో ఉంటుందట. అందుకోసం పాలల్లో పసుపుతో పాటు అల్లం మిరియాల పౌడర్ కలుపుకుని తాగితే డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. పాలల్లో పసుపు వేసుకుని తాగితే చాలా మంచింది. శరీరంలోని, జీర్ణాశయంలోని మలినాలు తొలగిపోతాయి.

 

పసుపు లోని ఐరన్, విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషక విలువలు చక్కెరను నియత్రించడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. ముందుగా పాలల్లో పసుపుతో పాటు కాస్త అల్లం వేసి వేడివేడిగా తాగాలి. దాని వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ అయ్యి మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది. అనేక వ్యాధుల బారి నుంచి పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు కాపాడుతాయి. ఇక డయాబెటిస్ పూర్తిగా మన నియంత్రణలో ఉండాలంటే గ్లాసు పాలల్లో అర టీస్పూన్ పచ్చి పసుపు, ఎండు మిరియాల పొడి బాగా కలిపి తాగాలి. డయాబెటిస్ రోగులు ఇలా తాగితే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -