Late Dinner: రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే ఏమవుతుందో తెలుసా?

Late Dinner: ఈ మధ్యకాలంలో చాలా మంది రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేస్తున్నారు. మరి ముఖ్యంగా యువత ఫ్రెండ్స్ పార్టీస్ అని చెప్పి బలాదూర్ గా తిరగడం అర్ధరాత్రి సమయంలో భోజనం చేయడం లాంటివి చేస్తున్నారు. ఏదైనా అంటే ఫ్యాషన్ స్టైల్ ట్రెండు అని చెబుతున్నారు. అయితే ఆ సమయంలో బాగానే ఉన్న ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కలిగే పరిణామం నెమ్మదిగా కనిపిస్తుంది. అయితే రాత్రి సమయంలో ఇలా ఆలస్యంగా భోజనం చేయడం ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేయడం వల్ల బరువు పెరగడంతో పాటు శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ పెరుగుతాయని, ఫ్యాట్ కంటెంట్ పెరుగుతుంది. రాత్రి భోజనం 7 గంటల లోపు తింటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల సరిగ్గా నిద్రపోకపోవడంతో నిద్ర లేకపోవడం మన శరీర బరువు, జీవక్రియను ప్రభావితం చేస్తుంది. సరైన సమయంలో తినడం వల్ల నిద్ర మెరుగుపడుతుంది. అలాగే అనేక ఆరోగ్య సమస్యలను మెరుగుపరుస్తుంది. రాత్రి తర్వాత తినడం వల్ల బరువు పెరగడం, తక్కువ శక్తి హార్మోన్ ఉత్పత్తి సమస్యలు తలెత్తుతాయి. దీని కారణంగా, రక్తంలో చక్కెర స్థాయిలు లిపిడ్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

 

ఇవి గుండె జబ్బులు ఇతర శారీరక సమస్యలను పెంచుతాయి. సమయానికి భోజనం చేయడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవు. కానీ రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేసే వారికి అనేక రకాల అనారోగ్య సమస్యలు తప్పవు. సమయానికి భోజనం చేసి రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య నిద్రపోతారు. ఇంకొందరు 9 గంటల లోపే నిద్రపోతూ ఉంటారు. సమయం దాటిన తర్వాత తినడం వల్ల అడిపోజెనిసిస్ ద్వారా ఎక్కువ కొవ్వు నిల్వ ఉంటుంది. శరీరానికి అవసరమైన ఆక్సిజన్ పరిమాణం ప్రకారం కార్బన్ డయాక్సైడ్ బయటకు పంపబడుతుంది. ఇది శరీరంలోని జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఆలస్యంగా తింటే శరీరంలో మెటబాలిజం తగ్గి కొవ్వు శాతం పెరుగుతుంది.

 

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -