Relationship: భోజనం తర్వాత సెక్స్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Relationship: సాధారణంగా పెళ్లి అయిన తర్వాత భార్యాభర్తలు దంపతి జీవితం ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే లైంగిక జీవితం కూడా బాగుండాలని కోరుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య శృంగారం ఎంతో కీలకమైనది అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా వారి మధ్య అన్యోన్యతను తెలియజేస్తుంది. కానీ శృంగారం విషయంలో చాలా మంది అనేక కలలు కంటున్నారు. ఆచరణలోకి వచ్చేసరికి అవన్నీ సాధ్యం కావడం చాలా కష్టంగా ఉంటుంది. శృంగారం విషయంలో అనేక రకాల అపోహలు ఉంటాయి.

ఇంకొందరు పిల్లల పుట్టే వరకు బాగా ఆసక్తిని కలిగిన తర్వాత సెక్స్ ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇకపోతే అసలు విషయంలోకి వెళ్తే చాలామందికి ఉన్న సందేహం ఏమిటంటే భోజనం తరువాత సెక్స్ చేయవచ్చా? భోజనానికి ముందే సెక్స్ చేయాలా? ఈ విషయంలో అనేక రకాల సందేహాలు కూడా నెలకొంటూ ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే శృంగారం భోజనానికి ముందు చేస్తే మంచిదా లేక తర్వాత చేస్తే మంచిదా? అంటే అది మనం తీసుకునే ఆహారం పై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.
అల్పాహారం, జ్యూస్‌, ఎనర్జీ డ్రింక్స్‌ వంటివి శృంగారానికి ముందు తీసుకోవచ్చు.

 

కడుపు నిండుగా తిన్నతర్వాత మాత్రం వెంటనే శృంగారంలో పాల్గొనకూడదు. ఎందుకంటే మన శరీరంలో రక్త ప్రసరణ సహా అన్ని వ్యవస్థలు మనం తిన్న ఆహారం మీదే దృష్టి కేంద్రీకరించి పనిచేస్తుంటాయి. తిన్నవెంటనే శృంగారంలో పాల్గొంటే త్వరగా అలిసిపోతారు. దీంతో శృంగారాన్ని పూర్తిగా ఎంజాయ్‌ చేయలేరు. ఒకవేళ లిమిట్‌గా తినేవారు, డైట్‌ ఫాలో అవుతున్న వారికైతే తిన్న తరువాతే శృంగారం మంచిది. అలా అని శృంగారం తర్వాత కూడా వెంటనే ఆహారం తినకూడదు. కొంచెం గ్యాప్‌ ఇచ్చి శరీరంలోని అన్ని వ్యవస్థలూ రిలాక్స్‌ స్టేజికి వచ్చాక తినాలి. అప్పుడు కూడా తక్కువగానే తినాలి. లేకుంటే ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఆహారం తినక ముందు అయినా తిన్న తర్వాత అయినా సెక్స్ లో పాల్గొంటే గ్యాప్ అన్నది తప్పనిసరి.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -