Rajamouli: జక్కన్న ఒక ఫ్లాప్ తీస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Rajamouli: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు అన్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో రాజమౌళికి సంబంధించిన ఒక వార్త హల్చల్ చేస్తోంది. అదేమిటంటే ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలు అన్ని హిట్ అయిన విషయం తెలిసిందే.

అయితే రాజమౌళి ఒక్క ఫ్లాప్ సినిమా తీస్తే ఏమవుతుంది అన్న ప్రశ్న ఆ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇదే విషయం గురించి అనేక రకాల చర్చలు కూడా నడుస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో చాలామంది బయటపడరు కానీ రాజమౌళి మా ఫ్లాప్ కావాలని కోరుకునే వారు చాలామంది ఉన్నారు. ఈ మాట మరెవరో చెప్పలేదు సంచలను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. రాజమౌళి అభిమానులు ఆయన సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకోవడం లేదు. కానీ ఇండస్ట్రీలో సినిమాలు తీసేవారే ఆయన ఫ్లాప్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారట.

 

బాహుబలి సినిమా తర్వాత బాహుబలి సినిమాను మించి తీయాలని ఎదురుచూస్తున్నప్పటికీ ఈ లోపే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కావడంతో రాజమౌళి సినిమాలు ఫ్లాప్ అవ్వాలని కోరుకునే వారి సంఖ్య మరింత పెరిగింది. ఇంకొందరు ఆర్ఆర్ఆర్ కంటే మంచి సినిమా తీయాలని భావిస్తున్నారు. ఆ రేంజ్ లో సినిమా తీయాలి అంటే బడ్జెట్ పెట్టాలి. డబ్బు పెట్టిన కూడా తర్వాత టికెట్ రేట్స్ ఎలా ఉంటాయో వర్క్ అవుట్ అవ్వాలి ఇలా చాలా తతంగమే ఉందని చెప్పవచ్చు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -