Mangoes: షుగర్ ఉన్నవారు మామిడి పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Mangoes: వేసవిలో మనకు ఎక్కువగా దొరికే పండ్లలో మామిడిపండు కూడా ఒకటి. వేసవి సీజనల్ ఫ్రూట్ అని కూడా మామిడిపండును పిలుస్తారు. ఈ మామిడి పండ్లు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటూ ఉంటారు. మామిడిపండ్లలో అనేక రకాల మామిడి పండ్లు కూడా ఉన్నాయి. అయితే మామిడిపండ్లు తినడం మంచిదే కానీ శృతి మించి తింటే మాత్రం సమస్యలు తప్పవు. అయితే మధుమేహం ఉన్నవారు మామిడి పండ్లు తినవచ్చా లేదా అన్న సందేహం నెలకొంటూ ఉంటుంది. మరి డయాబెటిస్ రోగులు మామిడి పండ్లు తినవచ్చా లేదా ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఒక అధ్యయనం ప్రకారం మామిడిపండును డయాబెటిస్ రోగులు తినవచ్చు అని తేలింది. అలా అని ఎక్కువ మామిడి పండ్లను తీసుకోకూడదు. తక్కువ మామిడి పండ్లను మాత్రమే తీసుకోవాలి. మామిడిపండును తినవచ్చు కానీ పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. డయాబెటిస్ రోగులు 1-2 ముక్కల వరకే తినాలి. అంతకుమించి తినడం మంచిది కాదు. ఇతర పండ్లలో ఉన్నట్టే ఇందులో కూడా కార్పోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ స్థాయిని పెంచుతాయి. కానీ మామిడి పండ్లలో ఉండే ఫైబర్ పంచదారను గ్రహించుకుంటుంది. అంటే తిన్న తరువాత బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలోనే ఉంటాయి. మామిడిని కట్ చేసి తినకూడదు.

 

మామిడిని కట్ చేయడం వల్ల అందులో ఉండే షుగర్ లెవెల్స్ పెరిగిపోగలవు. అందుకే మామిడిని రసం పిండుకుని తినాలి. అలాగే మామిడి పండ్లు ఎక్కువగా తినకూడదు. ఎక్కువ తినడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడమే కాకుండా ఇన్సులిన్ స్థాయిని తగ్గించవచ్చు. మామిడి జ్యూస్‌లో పంచదార కలుపుకుని తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఇలా తాగడం చాలా ప్రమాదం కరం. మామిడి జ్యూస్ తాగాలంటే నార్మల్‌ గానే తాగాలి. షుగర్ ఉన్నవారు సాధ్యమైనంతవరకూ పూర్తిగా పండింది కాకుండా కొద్దిగా పచ్చిగా ఉన్నది తింటే మంచిది. ఎందుకంటే కొద్దిగా పచ్చిగా ఉంటే పంచదార శాతం తక్కువగా ఉంటుంది. ఫలితంగా శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. డయాబెటిస్ రోగులు ఉదయం వాకింగ్ తరువాత లేదా వ్యాయామం తరువాత లేదా భోజనం చేసేటప్పుడు మామిడి పండు తినడం అనువైన సమయం. భోజనం మధ్యలో మామిడి పండు తినడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. మామిడి పండ్లతో పాటు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పెరుగు, పన్నీర్ లేదా చేపలు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -