Chiranjeevi: రామ్ చరణ్ విషయంలో చిరంజీవి చివరి కోరిక ఏంటో తెలుసా?

Chiranjeevi: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదుగుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినటువంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. చిరంజీవి ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఇండస్ట్రీలోనే మెగా ఫ్యామిలీ కంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఆయన కుమారుడు రాంచరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.

రామ్ చరణ్ సైతం వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సక్సెస్ అందుకోవడమే కాకుండా తండ్రిని మించిన తనయుడుగా గుర్తింపు పొందారు. చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందగా రామ్ చరణ్ మాత్రం గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందారు.ఇలా తన కొడుకు ఎదుగుదలతో చిరంజీవి కూడా పుత్రోత్సాహంలో ఉన్నారని చెప్పాలి.

 

చిరంజీవి ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ తన కుమారుడితో కలిసి కూడా నటించిన విషయం మనకు తెలిసిందే. గత ఏడాది కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా ద్వారా రామ్ చరణ్ చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి స్క్రీన్ పై కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేసినప్పటికీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి.

 

ఇలా తన కుమారుడితో కలిసి నటించాలన్న చిరంజీవి కోరిక నెరవేరింది కానీ చిరంజీవికి మరో కోరిక కూడా ఉందని తెలుస్తుంది. ఆ కోరిక పూర్తిగా రాంచరణ్ పైన ఆధారపడి ఉందని రామ్ చరణ్ నిర్ణయంతోనే చిరంజీవి కోరిక నెరవేరుతుందా లేదా అనేది తెలుస్తుంది. చిరంజీవి రామ్ చరణ్ తో కలిసి నటించారు. అయితే రామ్ చరణ్ కు పుట్టబోయే బిడ్డతో కూడా చిరంజీవికి నటించాలనే కోరిక ఉందట. మరి ఈ కోరిక నెరవేరుతుందో లేదో తెలియాల్సి ఉంది.రామ్ చరణ్ తన వారసత్వాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలా వద్దా అనుకోవడం పూర్తిగా వారి నిర్ణయమే అవుతుంది. దీంతో చిరంజీవి కోరికను తీర్చాలి అంటే పూర్తి బాధ్యత రామ్ చరణ్ పైనే ఉందని తెలుస్తుంది.మరి తన తండ్రి కోరికను రామ్ చరణ్ నెరవేరుస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -