Actress Laila: శ్రీకాంత్‌ను ఇప్పటికీ ఆ పేరు పెట్టి పిలుస్తా: హీరోయిన్ లైలా

Actress Laila:  ఇండస్ట్రీలో ఒక్కప్పటి స్టార్ హీరోయిన్ లైలా గురించి తెలియని వారంటూ ఉండరు. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తనదైన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న లైలాకు అప్పట్లో పెద్ద ఎత్తున ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండేది. కేవలం లైలా కోసమే థియేటర్లకు వెళ్లే అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. 1997లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఎగిరే పావురమా సినిమాతో లైలా ఆరంగేట్రం చేసింది.

ఈ సినిమాలో హీరోగా శ్రీకాంత్‌ నటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ లైలా సినిమా మొత్తం హీరోని ‘కొలబద్ద’ అంటూ ఆటపట్టిస్తూ ఉంటుంది. అంతేకాక పిల్లలతో కూడా ఓ పద్యం పాడిస్తుంది. ఈ చిత్రంలో ఆ సీన్ చూసిన వారంతా ఇప్పటికి కడుపుబ్బా నవ్వుకుంటూనే ఉంటారు. లైలా ఇప్పటికి శ్రీకాంత్‌ని ‘కొలబద్ద’ అని పిలుస్తుంటారంట. ఈ విషయాన్ని లైలా ఓ వేదికపై చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీకి విరామం ఇచ్చిన లైలా ప్రస్తుతం ‘సర్దార్‌’ సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది.

సర్దార్‌ సినిమాలో హీరోగా కార్తీ నటించగా.. ఈ చిత్రంలో లైలా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ మూవీ చిత్రబృందం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి లైలా కూడా హాజరైయ్యారు. యాంకర్.. లైలాను పిలుస్తూ కొలబద్ద అని అన్నారు. దీంతో ఆ డైలాగ్ విన్న లైలా ఒక్కసారిగా పగలబడి నవ్వింది. ఇక ఆమె ఆ డైలాగ్‌ను గుర్తుకు చేసుకుంటూ ఇప్పటికి శ్రీకాంత్‌ను ఆ పేరుతోనే పిలుస్తానని చెప్పుకొచ్చారు.

ఈ సందర్బంగా లైలా మాట్లాడుతూ.. సర్దార్ సినిమా నాకు చాలా స్పెషల్ ఫిల్మ్ అని చెప్పుకొచ్చారు. ఆమె నటించిన శివపుత్రుడు సినిమా దీపావళికి విడుదలై ఘన విజయం సాధించిందని అన్నారు. సర్దార్ సినిమా కూడా దీపావళి కానుకగా విడుదల కాబోతుందని పేర్కొన్నారు. ఈ చిత్రంలో కార్తీ ఎంతో అద్భుతంగా నటించారని, ప్రేక్షకులందరూ తప్పనిసరిగా ఈ సినిమాను థియేటర్‌కు వెళ్లి చూడాలని కోరారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -