Manoj: మనోజ్ మొదటి భార్య ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?

Manoj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న కుటుంబాల జాబితాలో మంచు ఫ్యామిలీ ఒకటి. మంచు మోహన్ బాబు వల్ల మంచు కుటుంబానికి టాలీవుడ్ లో గుర్తింపు రాగా.. ఈ కుటుంబానికి చెందిన వారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. మంచు మోహన్ బాబు మంచు విష్ణు హీరోగా చేస్తుండగా, మరో కొడుకు మంచు మనోజ్ కూడా హీరోగా ఉన్నాడు. అదే సమయంలో కూతురు మంచు లక్ష్మి ఆ మధ్యన సినిమాల్లో నటించగా.. ప్రస్తుతం ఓటీటీలో కుకింగ్ షో చేస్తూ బిజీగా ఉంది.

 

మంచు మోహన్ బాబుకు చెందిన మంచు ఫ్యామిలీలో అందరి కన్నా మంచి పేరు మంచు మనోజ్ కు ఉంది. సినిమాల ద్వారానే కాకుండా బయట కూడా మంచు మనోజ్ కు మంచి గుర్తింపు ఉంది. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా, అప్పుడప్పుడు సమాజంలో జరిగే అంశాల మీద ఘాటుగా స్పందిస్తూ అందరిలో ఆలోచనలు రేకెస్తుంటాడు.

 

తెలుగులో మంచు మనోజ్.. దొంగ దొంగది, బిందాస్, నేను మీకు తెలుసా?, కరెంట్ తీగ, గుంటూరోడు వంటి సినిమాలు చేశాడు. కాగా గత నాలుగేళ్లుగా మాత్రం మంచు మనోజ్ ఎలాంటి సినిమాలు చేయడం లేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్ త్వరలోనే రెండో చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీలో ఎంతో పేరు ఉన్న భూమా నాగిరెడ్డి రెండో కూతురు మౌనిక
ప్రణతి రెడ్డిని మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

 

మంచు మనోజ్ రెండు పెళ్లి గురించి అతడు స్వయంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా కానీ అతడు, మౌనిక రెడ్డిలు ఓ కార్యక్రమంలో కనిపించారు. పెళ్లి ప్రస్తావన తీసుకురాగా ఓ మంచి డేట్ చూసి దాని గురించి చెబుతా అని అనడంతో రెండు పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. అయితే మంచు మనోజ్ మొదటి భార్య ఇప్పుడు ఎక్కడ ఉంది? ఏం చేస్తోందనే చర్చ సాగుతోంది.

 

మంచు మనోజ్ మొదటి భార్య ప్రణతి రెడ్డి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇల్యూస్ట్రేషన్ ఆర్టిస్ట్ అయిన ప్రణతి రెడ్డి అక్కడే తన పనిలో బిజీగా గడుపుతున్నట్లు సమాచారం. కాగా మంచు మనోజ్, ప్రణతి రెడ్డిని ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. మంచు విష్ణు భార్య విరోనికా రెడ్డి ఫ్రెండ్, దూరపు బంధువు ప్రణతి రెడ్డి అని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -