Lifestyle: పిల్లల పెంపకంలో పెద్దవాళ్లు చేస్తున్న తప్పులు ఏంటో తెలుసా?

Lifestyle: ఈ మధ్యకాలంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు అన్న విషయాలను పట్టించుకోవడమే మానేశారు. దాంతో చిన్న వయసులోనే వారు చెడు అలవాట్లకు బానిసలుగా మారుతున్నారు. ఈ సంగతి పక్కన పెడితే చాలా మంది తల్లిదండ్రులు చేస్తున్న అతిపెద్ద తప్పు ఏమిటంటే వారు పడుతున్న కష్టాలు పిల్లలకు పడకూడదు అని వారిని ఎంతో సుకుమారంగా కష్టాలు తెలియకుండా పెంచుతున్నారు. అయితే ఇలా పెంచడం వల్ల ఆ పిల్లలు సుకుమారంగా పెరుగుతారు.

కానీ భవిష్యత్తులో వారు కష్టపడాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో కూడా తల్లిదండ్రుల పైన ఆధారపడుతూ ఉంటారు. ఈ విషయాన్ని చాలామంది తల్లిదండ్రులు గుర్తించకుండా పిల్లలను సుకుమారంగా పెంచుతూ వారిని బద్ధకస్తులుగా పనికిరాని వాళ్ళుగా మార్చేస్తున్నారు. టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో చిన్నచిన్న సరుకులు కావాలి అన్నా కూడా వెంటనే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి ఇంటి దగ్గరికి తెప్పించుకుంటున్నారు. ఎక్కువగా సిటీలలో ఇటువంటి కల్చర్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మనకు ఇంట్లో కావలసిన వస్తువులు తీసుకు రావడానికి వెళ్ళినప్పుడు ఆ ఎండ, వాన,గాలి చలి వర్షం వీటన్నింటీని పిల్లలకు అలవాటు చేయాలి.

 

అప్పుడే పిల్లలు కూడా ఏది మంచి ఏది చెడు, ఏది కష్టం ఏది సుఖం అన్న విషయాలను తెలుసుకుంటారు. అంతేకాకుండా బయటకి వెళ్ళినప్పుడు మనం ఎదుటి వ్యక్తులతో మాట్లాడినప్పుడుతల్లిదండ్రులు ఎవరితో ఇలా ప్రవర్తిస్తున్నారు అన్న విషయాలను గుర్తు పెట్టుకునే వారు కూడా నెక్స్ట్ టైం అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. మొత్తానికి తల్లిదండ్రులు పిల్లలను కష్టం లేకుండా పెంచడం అన్నది చాలా తప్పు. పిల్లలకు కష్టం నష్టం అనేది ఏంటి అనేది తెలిసేలా చేయాలి. అప్పుడే పిల్లలు జీవితంలో మీరు ఉన్నా లేకున్నా కూడా పిల్లలు సక్సెస్ అవుతారు..

Related Articles

ట్రేండింగ్

Girl Child: ఆడపిల్ల పుడితే 6000 రూపాయలు.. ప్రభుత్వం శుభవార్త ఇదే!

Girl Child: ప్రస్తుత రోజులో చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టడం ఒక దరిద్రంగా శాపంగా భావిస్తున్నారు. దారుణం ఏంటంటే మగవారు మాత్రమే కాకుండా చాలా మంది స్త్రీలు కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నారు.....
- Advertisement -
- Advertisement -