Prabhas: ప్రభాస్ కు నచ్చని రాజమౌళి మూవీ ఏంటో తెలుసా?

Prabhas: డార్లింగ్ ప్రభాస్‌కు టాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. బాహుబలితో ప్రపంచానికి తన సత్తా ఏంటో నిరూపించాడు ప్రభాస్‌. బాహుబలి వన్‌, బాహుబలి 2 మూవీలతో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ప్రభాస్‌దే. ఆ సినిమా తర్వాత ప్రభాస్‌ పూర్తిగా మారిపోయాడని అభిమానులు అంటున్నారు. కేవలం పెద్ద సినిమాలకే పరిమితం అవుతున్నాడని ప్రభాస్‌పై నిందలేస్తున్నారు అభిమానులు. డార్లింగ్‌ మళ్లీ చిన్న సినిమాలు కూడా చేయాలంటున్నారు.

 

ఇక ప్రభాస్‌, రాజమౌళి కాంబినేషన్‌లో మూవీ అంటేనే అంచనాలు పెరిగిపోతాయి. బాహుబలి కంటే ముందు ప్రభాస్‌తో రాజమౌళి ఛత్రపతి మూవీ తీశాడు. ఈ సినిమా కూడా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది. ఒక్క అడుగూ…. అంటూ ప్రభాస్‌ చెప్పిన డైలాగ్‌ ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయింది. ఈ సమయం నుంచే ప్రభాస్‌, రాజమౌళి మధ్య స్నేహ బంధం బాగా బలపడింది. బాహుబలి మూవీతో వీరి మధ్య స్నేహం మరింత స్ట్రాంగ్‌ అయ్యింది.

 

అయితే, రాజమౌళితో ప్రభాస్‌ చెప్పిన ఓ మాట తాజాగా ఫిల్మ్‌ నగర్‌ సర్కిళ్లలో తిరుగుతోంది. రాజమౌళి మూవీల్లో తనకు నచ్చని మూవీ ఉందని ప్రభాస్‌ చెప్పాడట. ఈ విషయం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. అదేంటి.. రాజమౌళి తీసిన ప్రతి సినిమా హిట్టే కదా.. అని అభిమానులకు సందేహాలు వస్తున్నాయి. అయితే, రాజమౌళి సినిమాల్లో ఒకానొక మూవీ తనకు ఛండాలంగా అనిపించిందని ప్రభాస్‌ చెప్పాడట.

 

ఆ సినిమా గురించేనా?
రాజమౌళి తీసిన సినిమాల్లో చాలా వరకు బంపర్‌ హిట్లు కొట్టాయి. ప్రస్తుతం మహేష్‌ బాబుతో మూవీ స్క్రిప్ట్‌ వర్క్‌లో బిజీగా ఉన్నాడు ఎస్‌ఎస్‌ రాజమౌళి. రాజమౌళి ఏ మూవీ తీసినా అందులో కీరవాణి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఉంటారు. అయితే, ప్రభాస్‌ ఓ మూవీ గురించి ఛండాలంగా ఉందని చెప్పడంపై అందరిలో ఆసక్తి పెరిగింది. జూనియర్‌ ఎన్టీఆర్‌తో రాజమౌళి తెరకెక్కించిన స్టూడెంట్‌ నంబర్‌ వన్‌ మూవీ ప్రభాస్‌కు నచ్చలేదట. ఈ సినిమా గురించి ప్రభాస్‌.. రాజమౌళితో అలా అన్నాడని ప్రస్తుతం నెట్టింట వార్తలు గుప్పుమంటున్నాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -