Sperms for Babies: పిల్లలు పుట్టాలంటే వీర్యం ఎలా ఉండాలో తెలుసా?

Sperms for Babies: పెళ్లి అయిన తర్వాత చాలామంది భార్యాభర్తలు తొందరగా పిల్లలు వద్దు అని అనుకుంటూ ఉంటారు. కొంతకాలం పిల్లలు వద్దనుకున్న భార్యాభర్తలు ఆ తర్వాత పిల్లలు కలగక ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకో మన పెద్దలు ఏ వయసులో ముచ్చట్లు ఆ వయసులో జరగాలి అని అంటూ ఉంటారు.

కానీ ఎంత ప్రయత్నించినా పిల్లలు మాత్ర కలగరు. దాంతో గుళ్ళు గోపురాలు,హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే పిల్లలు కలగాలి అని ప్రయత్నించినప్పటికీ పిల్లలు కలగడం లేదు అంటే ఏదో రకమైన సమస్యలు ఉంటాయని తెలుసుకోవాలి.

 


అటువంటప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. అప్పుడు వైద్యులు ఇద్దరినీ పరిశీలించి ఇద్దరిలో ఎవరిలో లోపం ఉందో చెక్ చేసి అందుకు తగిన ట్రీట్మెంట్ ని కూడా అందిస్తారు. అయితే ఇద్దరికీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోయినప్పటికీ కొందరు పిల్లలు కలగక ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనినే అన్ ఎక్స్ ఫ్లెయిన్డ్ ఫెర్టిలిటీ సమస్య అంటున్నారు. దంపతులు ఇద్దరిలో విడివిడిగా పిల్లలను కనే సామర్థ్యం ఉంది. కానీ వారిద్దరికీ కలిపి పిల్లలను కనే అవకాశం లేదు.

డీఎన్ఏ డ్యామేజీనే దానికీ కారణం అంటున్నారు నిపుణులు.

అయితే ఒకప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు దీనికి కూడా సరైన ట్రీట్మెంట్ ని కనిపెట్టేశారు. కాబట్టి ఇలాంటి సమస్య మీకు ఎదురైతే ముందుగానే సరైన చికిత్స తీసుకోవాలి. ఇక పురుషుల్లో లోపం విషయానికి వస్తే.. వారిలో వీర్యకణాల సంఖ్య సరిగా ఉండాలి. అంతేకాకుండా వీర్యం క్వాలిటీ కూడా మంచిగా ఉండాలి. ఒక్క స్ఖలనంలో కనీసం 20 మిలియన్ల వీర్యకణాలు ఉండాలి. అందులో సగం వీర్య కణాలు మార్ఫాలజీ సహజంగా ఉండాలి. వీర్యకణాల ఆకారం లోనూ లోపాలు ఉంటున్నాయి. వీర్య కణంలో తల, మధ్యభాగం, తోక ఉంటుంది. ఈ మూడింట్లో ఏ ఒక్కదాంట్లో లోపం ఉన్నా పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. తల భాగంలో ఏదైనా సమస్య ఉంటే అది అండంలోకి సరిగ్గా చొచ్చుకుపోలేదు. మధ్యభాగంలో లోపం ఉంటే అండంలోకి పూర్తిగా చేరుకోలేదు. ఒకవేళ తోకలోనే లోపం ఉంటే అండం దాకా ఈదలేదు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -