Sonakshi Sinha: స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన సోనాక్షికి ఇలాంటి పరిస్థితా?

Sonakshi Sinha: ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ పుట్టుకొస్తూనే ఉన్నారు. దీంతో హీరోయిన్స్ మధ్య పోటీ కూడా ఎక్కువగానే ఉంటోంది. ఒకానొక సమయంలో కళ్లు మూసి తెరిచే లోపు ఒకరి అవకాశం మరొక్కరు సొంతం చేసుకుంటున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన వారు సైతం అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొంత మంది హీరోయిన్స్ సరైన అవకాశాలు రాకపోవడంతో ఐటెం సాంగ్స్ కూడా చేయడానికి వెనుకాడటం లేదు. ప్రస్తుతం ఉన్న ఈ పోటీ ప్రపంచంలో హీరోయిన్‌గా రాణించాలంటే అన్ని రకాల టెక్నిక్స్ తెలిసి ఉండాలి.

సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుల వారసులుగా అబ్బాయిలు ఇండస్ట్రీకి పరిచయమైతే.. బాలీవుడ్ ఇండస్ట్రీలో నటులు వారసులుగా అమ్మాయిలు ఎక్కువగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ఇక ఇప్పుడు వారసురాళ్ల మధ్య పోటీ తలెత్తితే వాతావరణం యుద్ధాన్ని తలపిస్తుంది. నువ్వెంతంటే? నువ్వెంత అనుకునే స్థాయికి వివాదం చేరుతుందనే మీరే అర్థం చేసుకోండి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో.. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీకి క్రేజ్ తగ్గిపోయిందనే చెప్పుకోవచ్చు. బాలీవుడ్ నటులు సైతం టాలీవుడ్ చిత్రాలపై ఆసక్తి చూపిస్తున్నారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతుంది. తాజాగా స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ఈ అమ్మడుకి కొంతకాలంగా సరైన విజయాలు లేక రేసులో వెనకపడిపోయింది. ఇక ఇండస్ట్రీలో సరైన అవకాశాలు కూడా అందుకోలేకపోతుంది. అయితే ప్రస్తుతం సోనాక్షి సిన్హా చేతిలో ‘డబుల్ ఎక్స్‌ఎల్’ సినిమా తప్ప వేరే చిత్రాలు ఏమి లేవు. దీంతో ఈ భామ తన రూట్‌ను మార్చుకొని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల వైపు దృష్టి మళ్లించిన్నట్లు తెలుస్తోంది.

డబుల్ ఎక్స్‌ఎల్ సినిమా తరువాత సోనాక్షి సిన్హా ఒక్క ప్రాజెక్టుకి కూడా ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఆ సినిమాలో సోనాక్షి సిన్హాకి తోడుగా వాణీ కపూర్‌ని తెచ్చుకుని ‘ఏ గర్ల్ ఇన్ ది ఎల్లో సూట్ కేస్’ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం లేడీ ఓరియేంటెడ్ థ్రిల్లర్ జానర్. ఈ సినిమా జాతీయ ఉత్తమ దర్శకుడు ఆషీమ్ అహ్లువాలియా దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. సోనాక్షి సిన్హా హీరోలతో సరైన అవకాశాలు లేకపోవడంతోనే హీరోయిన్లతో కలిసి ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -