Tarak: తారక్ ఇద్దరు కొడుకులలో ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా?

Tarak: అతి చిన్న వయసులో ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్ల నిండక ముందే స్టార్ హీరో హోదా ను దక్కించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. నందమూరి వంశం నుంచి ఈ తరం నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఎన్టీఆర్ పర్సనల్ లైఫ్ గురించి చాలామందికి తెలియదు.

 

ఎన్టీఆర్ మే నెల 5వ తేదీన ,2011 సంవత్సరం లో లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నారు. పదివేల మందికి పైగానే హాజరైన ఈ వివాహం భారీ సినిమా స్టైల్ సెట్టింగ్స్ మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ ,లక్ష్మీ ప్రణతి ఎంతో చూడ చక్కని జంట. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కొడుకులకు తండ్రి అయ్యాడు. తన కుటుంబంతో కలిసి ఎన్టీఆర్ తీసుకుని పిక్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

 

జూనియర్ ఎన్టీఆర్ కు ఆయన తాత అయిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు పేరును పెట్టారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ గారు తన కొడుకుల అందరికీ కృష్ణ అనే పదం కామన్ గా వచ్చేలా పేర్లు పెట్టుకున్నారు. అలాగే హరికృష్ణ కి కూడా తన తండ్రి పేరు తన పిల్లలకి రావాలి అన్న ఉద్దేశంతో జానకి రామ్,కళ్యాణ్ రామ్ మరియు తారక్ రామ్ అని పెట్టుకున్నారు.

 

ఇదే పరంపరను కొనసాగిస్తూ కళ్యాణ్ రామ్ తన కొడుకు పేరు శౌర్యా రామ్ అని పెట్టుకున్నారు.అలాగే ఎన్టీఆర్ తన ఇద్దరి పిల్లల పేర్లు అభయ్ రామ్, భార్గవ్ రామ్ అని పెట్టుకున్నారు. అభయ్ మరియు భార్గవ్ ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారట. సాధారణంగా ప్రతి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఏదో ఒక విషయంలో తగాదా జరుగుతూ ఉంటుంది. కానీ తారక్ ఇద్దరు కొడుకులు మాత్రం ఎంతో ఆప్యాయంగా కలిసిమెలిసి ఉంటారని ,ఒకరికొకరు సహాయం చేసుకుంటారని సమాచారం. తారక్ కూడా తన ఇద్దరి కొడుకుల మధ్య ఉన్న అన్యోన్యతను చూసి మురిసిపోతుంటారు అని ఆయన సన్నిహితుల బోగట్టా.

Related Articles

ట్రేండింగ్

Kiran Kumar Reddy: కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్.. కిరణ్ కుమార్ రెడ్ది సంచలన వ్యాఖ్యలు వైరల్!

Kiran Kumar Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కిరణ్ కుమార్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయాలలో నేడు ఈ స్థాయిలో...
- Advertisement -
- Advertisement -