Gulab Jamun: గులాబ్‌ జామ్‌లో అది కలిపి తిన్న వీడియోకు నెటిజన్స్‌ కామెంట్లో ఏంటో తెలుసా?

Gulab Jamun: నేటి కాలంలో శరవేగంగా దూసుకుపోతున్న సోషల్‌ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూలన ఏం జరుగుతుందో క్షణాల్లో తెలిసిపోతుంది. మంచి జరిగినా.. చెడు జరిగినా.. వీడియోలు తీసి పోస్ట్‌ చేయడం దాన్ని వీక్షించిన వ్యూవర్స్‌ అందుకు తగ్గ స్పందించడం కామనైపోయింది. కొందరు సోషల్‌ మీడియాలో పెట్టే పోస్టులతో కొందరి లైఫ్‌లు కూడా మారిపోతున్నాయి. కొందరు తీసుకునే ఆహార పదార్థాలు భిన్న విభిన్నంగా ఉంటాయి. కొందరు స్వీట్స్‌ను ఎక్కువగా ఇష్టపడితే మరికొందరు కారాన్ని ఇష్టపడుతారు. వైన్‌ కూడా ఒకొక్కరు ఒక్కో విధంగా తాగుతుంటారు. కొందరు వైన్‌ తాగేటప్పుడు స్టఫ్‌ లేకుండా తాగారు. కొందరైతే ఎలాంటి స్టఫ్‌ లేకుండానే నీళ్లు సైతం కలుపుకోకుండా తాగుతుంటారు.

 

మద్యం అలా తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పుతున్నా వారికి మాత్రం అలా తాగనిదే కిక్‌ ఎక్కదంటారు మద్యం ప్రియులు. తాజాగా ఓ మద్యం ప్రియుడి తాగిన విధానం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. సాధారణంగా వైన్‌ను నీళ్లు లేదా గ్లాస్‌లో స్పైసీగా ఉండే పదార్థాలతో తాగుతారు. కానీ.. ఓ వ్యక్తి మాత్రం గులాబ్‌జామ్‌లో వైన్‌ కలుపుకుని అది కూడా స్టౌపై వేడిచేసి తాగిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండగా అందుకు తగ్గ నెటిజన్స్‌ కామెంట్లు గుప్పిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Gauravi (@gauravi_vinay)

ఈ వీడియోలో ఏ ముందంటే.. ఓ వ్యక్తి ఓ చిన్న గిన్నెలో రెండు గులాబ్‌ జామ్‌లతో పాటు కొంత రసాన్ని తీసుకుని అందులో అందులో ఓల్డ్‌ మంక్‌ రమ్‌ను కలిపాడు. వాటిని బాగా కలిపి పక్కనే ఉండే సిలిండర్‌పై కొన్ని సెకన్లు వేడి చేశాడు. అలా వేడి చేసినప్పుడు ఆ గులాబ్‌ జామూన్‌ రంగు కొద్దిగా గోల్డ్‌ రంగులోకి మారుతుంది. కాసేపటి తర్వాత దాన్ని చల్లార్చి వాటిని తినడం ప్రారంభిస్తాడు. అయితే ఈ వీడియోలో చూపించిన విధంగా కూడా చాలా మంది తింటుంటారని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. అయితే ఇలా గులాబ్‌ జామ్‌లో మద్యం కలుపుకుని తాగడం ఆరోగ్యానిక హానీకనమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కేవలం మద్యాన్ని నీరు, లేదా సోడా కలిపి తాగాలని ఇలాంటి తీసి పదార్థాలతో తాగితే సైడ్‌ ఎఫెక్ట్‌ వస్తాయని హెచ్చరిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -