Pregnancy: సెక్స్ తర్వాత ప్రెగ్నెన్సీ రావాలంటే ఏం చేయాలో తెలుసా?

Pregnancy: సాధారణంగా పెళ్లి అయిన తర్వాత చాలామంది భార్యాభర్తలు తొందరగా పిల్లలు కలగాలని కోరుకుంటే మరికొందరు లైఫ్ని ఎంజాయ్ చేయాలని కొద్దిగా కాలం పాటు పిల్లలు వద్దనుకుంటూ ఉంటారు. ప్రస్తుత కాలంలో 50 శాతం మంది భార్యాభర్తలు ఇలానే ఆలోచిస్తున్నారు. చాలామంది మొదట్లో గర్భం దాల్చిన కూడా తర్వాత లేటుగా పిల్లలు కనాలి అన్న ఉద్దేశంతో అబార్షన్ చేయించుకోవడానికి సైతం వెనకాడరు. కరెక్ట్ గా పిల్లలు కావాలి అనుకున్న సమయానికి ఏదో రకమైన సమస్యలు వచ్చి పూర్తిగా పిల్లలు కలగకుండా అయిపోయే ప్రమాదం కూడా ఉంటుంది

 

అయితే పెళ్లయిన భార్య భర్తలు అలాగే పిల్లలు కావాలి అనుకున్న వారు కొన్ని రకాల టిప్స్ ని ఫాలో అవడం వల్ల గర్భం తొందరగా దాల్చవచ్చు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రస్తుత రోజుల్లో చాలామంది భార్యాభర్తలు పిల్లలు కలగగా హాస్పిటల్స్ గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కొందరు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టిన పిల్లలు కలగడం లేదని బాధపడుతూ ఉంటారు. కొంతమందికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ సంతానం కలగడం ఆలస్యం అవుతూ ఉంటుంది. దానికి మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే కారణం అంటున్నారు నిపుణులు.

కలయిక తర్వాత స్త్రీ, పురుషులు తమ జననాంగాలను శుభ్రం చేసుకుంటారు. అలా చేసుకోవాలి. కలయిక తర్వాత శుభ్రం చేసుకోకపోతే ఇరువురికి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పురుషులు వెంటనే శుభ్రం చేసుకుంటే పర్లేదు. కానీ పిల్లలు కావాలనుకుంటున్నవారు మాత్రం స్త్రీలు కలయిక జరిగిన వెంటనే శుభ్రం చేసుకోకూడదు. కలయిక వెంటనే నీటితో శుభ్రం చేస్తే వీర్యం మొత్తం బయటకు వెళ్లిపోతుంది. దీంతో ప్రెగ్నెన్సీ రావడం కుదరదు. కలయిక తర్వాత వెంటనే కాకుండా ఒక గంట ఆగి నీటితో శుభ్రం చేసుకోవడం మంచిది.

చాలా మంది అప్పటి వరకు గర్భనిరోధక మాత్రలు వాడి ఉండవచ్చు.

 

అయితే పిల్లలు కావాలి అనుకుంటే మాత్రం కొన్ని నెలలకు ముందుగానే వాటిని ఉపయోగించడం మానేయాలి. ఎందుకంటే ఆ టాబ్లెట్ల ప్రభావం కొన్ని నెలలపాటు శరీరంలో అలాగే ఉంటుంది. కాబట్టి వెంటనే ప్రెగ్నెన్సీ రాదు. కొన్ని నెలలకు ముందే వాటిని ఆపేసిన తర్వాత పిల్లల కోసం ప్రయత్నించాలి. మద్యం లేదా స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉంటే ముందుగానే మానేయాలి. ఈ అలవాటు ఇద్దరిలో ఏ ఒక్కరికి ఉన్నా కూడా పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోతుంది. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.అలాగే పీరియడ్స్ అయిపోయిన తర్వాత మళ్లీ స్త్రీలో అండం తయారైన సమయంలో కలయికలో పాల్గొంటే గర్భం దాల్చడం చాలా సులభంగా ఉంటుంది. అప్పుడు కాకుండా ఇతర సమయంలో సంభోగంలో పాల్గొన్నా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. మంచి ఆహారం తీసుకోవాలి. కడుపుతో ఉన్నప్పుడు మాత్రమే కాదు. కడుపు పండాలన్నా కూడా హెల్దీ డైట్ ఫాలో అవ్వాలి. ఈ విషయంలో పురుషులు తీసుకునే ఆహారం కూడా కీలక ప్రాత పోషిస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -