Black Spots: శరీరంపై నల్లదనం, మచ్చలు పోవాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?

Black Spots: ప్రస్తుత రోజుల్లో చాలా మంది స్త్రీ పురుషులు చర్మ సంబంధించిన సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు. వీటిలో మంగు మచ్చలు అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈ మంగు కారణంగా అమ్మకం అంతా కూడా చాలా గలీజ్ గా కనిపించడంతోపాటు అది అక్రమంగా ముఖం అంతా కూడా విస్తరిస్తూ ఉంటుంది. అయితే ముఖంపై మంగు మ‌చ్చ‌లు రావ‌డానికి వివిధ కార‌ణాలు ఉంటాయి. హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, వ‌య‌సు పైబ‌డ‌డం, ఎండ‌లో ఎక్కువ‌గా తిరగ‌డం, వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మందులు వాడ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ముఖంపై మంగు మ‌చ్చ‌లు వ‌స్తూ ఉంటాయి.

మంగు మ‌చ్చ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎటువంటి న‌ష్టం క‌ల‌గ‌న‌ప్ప‌ట‌కి వీటి కార‌ణంగా ముఖం అంద‌విహీనంగా క‌నిపిస్తూ ఉంటుంది. చాలా మంది మంగు మ‌చ్చ‌లు క‌నబ‌డ‌కుండా ఉండ‌డానికి వాటిపై పౌడ‌ర్ ను, వివిధ ర‌కాల క్రీముల‌ను రాస్తూ ఉంటారు. అయితే ఎటువంటి ఖ‌ర్చు లేకుండా చాలా సుల‌భంగా మ‌నం ఈ మంగు మ‌చ్చ‌ల‌ను నివారించుకోవ‌చ్చు. మంగు మ‌చ్చ‌ల‌ను నివారించ‌డంలో మ‌నకు బంగాళాదుంప చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. దీని కోసం బంగాళాదుంప‌ను అడ్డంగా ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

 

త‌రువాత ఇలా క‌ట్ చేసుకున్న బంగాళాదుంప ముక్క‌ను తీసుకుని మ‌చ్చ‌ల‌పై బాగా రుద్దాలి. ఇలా 10 నిమిషాల పాటు బంగాళాదుంప ముక్క‌తో మ‌చ్చ‌ల‌పై సున్నితంగా రుద్దాలి. త‌రువాత దీనిని పూర్తిగా ఆరే వ‌ర‌కు అలాగే ఉంచాలి. త‌రువాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా బంగాళాదుంప‌ల‌తో రుద్ద‌డం వ‌ల్ల ఆ భాగంలో చ‌ర్మం చ‌ల్ల‌గా మార‌డంతో పాటు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ కూడా ఎక్కువ‌గా జ‌రుగుతుంది. దీంతో ఆ భాగంలో మ‌లినాలు తొల‌గిపోవ‌డంతో పాటు దెబ్బ‌తిన్న చ‌ర్మ క‌ణాలు కూడా సాధార‌ణ స్థితికి వ‌స్తాయి. దీని వ‌ల్ల ఆ భాగంలో చ‌ర్మం త్వ‌ర‌గా సాధార‌ణ రంగులోకి వ‌స్తుంది. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా చేయ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా మ‌నం మంగు మ‌చ్చ‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. మంగు మ‌చ్చ‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అంతే కాకుండా మార్కెట్లో దొరికే వివిధ రకాల కెమికల్ ప్రోడక్ట్ ల కంటే ఇది ఎంతో మంచిది అని చెప్పవచ్చు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -