Upasana: పిల్లల విషయంలో ఉపాసన కోరిక ఏంటో తెలుసా?

Upasana: టాలీవుడ్ క్యూట్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రామ్ చరణ్ హీరోగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మరొకవైపు ఉపాసన రామ్ చరణ్ కు భార్యగా, కొణిదెలా ఇంటికి కోడలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరొకవైపు అపోలో హాస్పిటల్స్ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తోంది. తనకు సమయం దొరికినప్పుడల్లా ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో పాటు తన అభిమానులతో ముచ్చటిస్తూ అభిమానులకు మంచి మంచి ఆరోగ్య సూత్రాలను చెబుతూ ఉంటుంది.

అలాగే అప్పుడప్పుడు సామాజిక కార్యక్రమాలను కూడా చేపడుతూ ఉంటుంది. ఇక సోషల్ మీడియా ద్వారా తన భర్తకు తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది ఉపాసన. ఇది ఇలా ఉంటే మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభవార్త ఇటీవలే రానే వచ్చింది. రామ్ చరణ్, ఉపాసన ఇప్పుడు తల్లిదండ్రులు అవుతారా అని మెగా అభిమానులతో పాటు మెగా ఫ్యామిలీ కూడా ఎంతగానో ఎదురుచూస్తోంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఉపాసన ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో త్వరలోనే చిన్న చెర్రీ రాబోతున్నాడు అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో సందడి సందడి చేశారు.

దాదాపుగా పెళ్లి అయిన పదేళ్ల తర్వాత ఈ దంపతులకు పిల్లలు కలగబోతున్నారు అన్న ఆనందంలో ఉన్నారు మెగా అభిమానులు. ఇది ఇలా ఉంటే తాజాగా ఉపాసనకు సంబంధించిన ఒక ఆసక్తికర తెగ వైరల్ అవుతోంది. అదేమిటంటే ఉపాసన తనకు పుట్టబోయే బిడ్డ విషయంలో కొన్ని రకాల ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అవేమిటంటే ఉపాసన తనకు మగ బిడ్డ పుట్టాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరి ఉపాసన అనుకున్న విధంగా మెగా ఇంటికి వారసుడు కాబోతున్నారా లేక వారసురాలు రాబోతుందా అన్నది తెలియాలి అంటే మరి కొన్ని నెలలు వేచి చూడాల్సిందే మరి. అలాగే ఉపాసన అనుకుంటున్న విధంగా వారసుడు పుడతాడో లేదో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -