Head bath: పెళ్ళైన స్త్రీలు ఈరోజు తల స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Head bath: భారతదేశంలో హిందువులు ఇప్పటికీ ఎన్నో రకాల ఆచారాలు సంప్రదాయాలను పాటిస్తూనే ఉన్నారు. శతాబ్దాలుగా ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. అయితే హిందువులు కొంతమంది వాటిని శాపంగా కూడా భావిస్తూ ఉంటారు. సంప్రదాయాల వెనుక కారణం అలాగే ప్రత్యేక ప్రాధాన్యత కూడా ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఎన్నో రకాల సంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు. ఇకపోతే స్త్రీల విషయానికి వస్తే స్త్రీలు పెళ్లికి ముందు పెళ్లి అయిన తర్వాత కొన్ని రకాల నియమాలను తప్పకుండా పాటించమని చెబుతూ ఉంటారు. మరి ముఖ్యంగా పెళ్లి అయిన తర్వాత తల స్నానం విషయంలో కొన్ని రకాల నియమాలను పాటిస్తూ ఉంటారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

పెళ్ళైన స్త్రీలు వారంలోని కొన్ని రోజులలో జుట్టును కడుక్కుంటే అది వారి భర్తలకు ,కుటుంబానికి మంచిది కాదు. మంగళ, గురు, శనివారాల్లో స్త్రీలు జుట్టు కడగకూడదని నమ్ముతారు. అలాగే సోమవారాలు కూడా జుట్టు కడగడం నిషేధించారు. ఇది కాకుండా అమావాస్య, పూర్ణిమ, ఏకాదశి కూడా వివాహిత స్త్రీలకు జుట్టు కడగకూడదని సలహా ఇస్తారు. మహిళలు ఉపవాసం రోజున కూడా తమ జుట్టును కడగకూడదు, వాస్తవానికి వారు 1 రోజు ముందు తమ జుట్టును కడగవచ్చని చెబుతూ ఉంటారు. ఇకపోతే స్త్రీలు ఏ రోజున జుట్టును శుభ్రం చేసుకోవాలి అన్న విషయానికొస్తే.. సోమవారం జుట్టు కడగడం ఇంటి పురోగతికి మంచిది కాదు.

 

కానీ మీరు ఆ రోజు ఉపవాసం ఉండి, మీ జుట్టును కడగడం తప్పనిసరి అయితే, పలాష్ లేదా మోదుగ పువ్వును చేతితో మెత్తగా చేసి మీ జుట్టుకు పట్టించి స్నానం చేయడం మంచిది. అదేవిధంగా మంగళవారం రోజున తలస్నానం చేయకూడదు. ఒకవేళ మంగళవారం రోజు తలస్నానం చేయాల్సి వస్తే ఉసిరి రసం లేదా ఉసిరి పొడిని పేస్టులా చేసి జుట్టుకు పట్టించి తర్వాత తలస్నానం చేయవచ్చు. అలాగే బుధవారం రోజున చిన్న తోబుట్టువులు ఉన్న స్త్రీలు జుట్టును కడగకూడదు. బుధ గ్రహానికి అధిపతి అయిన బుధుడు తమ్ముళ్లకు కారకుడు. ఆరోజున తమ్ముళ్లు జుట్టు కడుక్కునేందుకు అపరాధంగా భావిస్తారు. బుధవారం జుట్టును కడగడం వల్ల సోదరికి అనేక సమస్యలు వస్తాయి.

 

ఒకవేళ బుధవారం రోజు స్నానం చేయాల్సి వస్తే నాలుగు లేదా ఐదు తులసి ఆకులను తలపై వేసుకొని నీటితో స్నానం చేయడం మంచిది. అలాగే గురువారం రోజున తల స్నానం చేయడం వల్ల భర్త వయసు తగ్గుతుందని చెబుతూ ఉంటారు. అలాగే పిల్లలకు సంబంధించిన సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఆరోజున స్నానం చేయాల్సి వస్తే శనగపిండిలో కొంచెం పసుపు వేసి జుట్టుకు అప్లై చేసి ఆ తర్వాత స్నానం చేయాలి. శనివారం రోజున తల స్నానం చేయడం మంచిది కాదు. ఒకవేళ తల స్నానం చేయాల్సి వస్తే జుట్టుకు పచ్చిపాలను పట్టించి ఆ తర్వాత స్నానం చేయాలి. ఇక మహిళలు ఎప్పుడు జుట్టును కత్తిరించుకోవచ్చు అన్న విషయానికి వస్తే.. ఆదివారం శుక్రవారా లలో తమ జుట్టును కడగవచ్చు అలాగే జుట్టును కత్తిరించుకోవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -