NTR: ఆ రంగంలోకి రావాలనుకున్న జూనియర్ ఎన్టీఆర్.. కానీ?

NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ ఎన్టీఆర్. కెరీర్ ప్రారంభంలో జూనియర్ ఎన్టీఆర్ వరుసగా యాక్షన్ సినిమాలో నటిస్తూ మాస్ ఆడియన్స్ ను మెప్పించారు. డాన్స్ చేయడంలోనూ, డైలాగ్ డెలివరీలోనూ ఆయనకు ఆయనే సాటి. ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘స్టూడెంట్ నం.1’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆది’ మంచి హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన పలు సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి.

 

 

జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘రాఖీ, సాంబ, ఆంధ్రావాలా, కంత్రి’ వంటి సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. మళ్లీ ఎన్టీఆర్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘యమదొంగ’ హిట్‌ను అందుకున్నాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. అప్పటివరకు యాక్షన్ సినిమాల్లో నటించిన ఎన్టీఆర్ ‘బృందావనం’ సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు చేరువయ్యాడు. అలాగే వివి వినాయక్ దర్శకత్వంలోని ‘అదుర్స్’ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షులకులను కడుపుబ్బా నవ్వించాడు.

 

ఎన్టీఆర్ కెరీర్ విషయంలో ఎంతో ఆలోచించి అడుగులు వేస్తారు. కథ ఎంపిక విషయంలో ఎన్టీఆర్ జాగ్రత్తగా ఉంటూ సూపర్ హిట్ సినిమాలలో నటిస్తూ మంచి విజయాన్ని అందుకుంటున్నాడు. ఆయన నటించిన ‘అరవింద సామెత, జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో’ వంటి సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులను అందించాడు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ వెండితెరపై సందడి చేస్తూనే బుల్లితెరపై హోస్ట్ గా కూడా వ్యవహరించారు. అయితే ఎన్టీఆర్ ఇండస్ట్రీకి రాకపోయింటే బిజినెస్ మేన్ కావాలని అనుకున్నారని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కానీ ఊహించని విధంగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాయని, ఇప్పుడిలా అభిమానుల ముందు ఉన్నట్లు ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -