Sea Vegetables: సముద్రపు పాలకూర తింటే వచ్చే లాభాలివే!

Sea Vegetables: ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివని పూర్వకాలం తో పాటు ఆధునిక వైద్యులు సైతం సూచిస్తున్నారు. ఆకుకూరలు ఆరోగ్యంతో పాటు కంటి చూపుకు కూడా ఎంతో మేలు చేస్తాయి. చాలా మందికి సీ–ఫుడ్‌ నాన్‌వేజ్‌ గురించి మాత్రమే తెలుసు.అయితే మనం వండుకునే పాలకూర తరహా సముద్రాల్లోనూ పుష్కలంగా ప్రొటీన్లతో ఉన్న ఇంకో పాలకూర కూడా ఉందనే విషయం చాలా మందికి తెలిదు. సముద్రంలో లభించే పాలకూరను తినేందుకు ప్రస్తుతం ప్రత్యేకంగా సాగు చేయడం ఆసక్తికరంగా మారింది. దీన్నే సీ–వీడ్స్‌ అంటారు. మన పాలకూర మాదిరిగా ఉండటంతో వీటిని సముద్రపు పాలకూర అంటున్నారు. ఇవి సముద్రపు నీటిలో పెరిగే నాచు రకానికి చెందిన మొక్కలు. వీటిలో పుష్కలంగా పోషక విలువలున్నాయనే విషయం గుర్తించిన తర్వాత వీటిని సీ వెజిటబుల్స్‌ లేదా సీ ప్లాంట్స్‌ అని పేరు పెట్టి పిలవడం ప్రారంభించారు. వాటి సాగుకు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.

 

 

చైనా, జపాన్‌ తదితర ఆసియా దేశాల్లో సహజసిద్ధంగా సముద్రపు నీటిలో పెరిగే వీటిని సేకరించి తినే అలవాటు తరతరాలుగా ఉంది. వీటి విలువను గుర్తించి అమెరికా, కెనడాల్లో ఇప్పుడు వీటిని కొన్ని కంపెనీలు చెరువుల్లో పెంచడం ప్రారంభించాయి. ఇజ్రాయిల్‌కు చెందిన ఓ కంపెనీ సేంద్రియ నీ వెజిటబుల్‌ను సాగుచేసే ప్రత్యేక సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఆహార ఉత్పత్తులకు అదనపు పోషకాలు జోడించడానికి, ఔషధాల ఉత్పత్తిలో వీటిని విరివిగా వాడుతున్నారు.

 

 

సాగు చేసే పద్ధతి..

సీ–వీడ్స్‌ సముద్రపు నీటిలో సహజసిద్ధంగా పెరుగుతుంటాయి వాతావరణ పరిస్థితులను బట్టి కొన్ని సీజన్లలోనే ఇవి అందుబాటులో ఉంటాయి. వీటిని తీరం వెంట సముద్రపు నీటిలో కేజెస్‌లో సాగు చేయటం ప్రారంభించారు. తీర ప్రాంతాల్లో నాచ్చురల్‌ నిర్మించిన చెరువుల్లో సముద్రపు నీటిని తోడి వీటిని సాగు చేస్తున్నారు. సాధారణ సముద్ర జలాల్లోని భార ఖనిజాలు, ఇతర కాలుష్యాలు అంటకుండా సముద్ర గర్భం నుంచి శుద్ధమైన నీటిని తోడి తెచ్చి తీరానికి దగ్గరలో నేలపై కృత్రిమ ఉప్పు నీటి చెరువుల్లో సాగు చేసే విధానమే సేంద్రియ సీ వీడ్స్‌ సాగు నీటి ఉష్ణోగ్రతను, కాంతిని నియంత్రించడం ద్వారా ఏడాది పొడవునా వీటిని నిరంతరాయంగా సాగు చేపట్టవచ్చని సంస్థ చెబుతోంది. సీ వీడ్‌ ముక్కలను వేస్తే తక్కువ కాలంలోనే అవి పెరిగి పెద్దవుతాయి. పెరుగుదల క్రమంలో వయసును బట్టి మూడు దశలు ఉంటాయి. ఒక్కో దశకు వేర్వేరు చెరువుల వ్యవస్థను ఈ కంపెనీ రూపొందించింది. సముద్రపు జలాల్లోని సహజ పోషకాలు, బ్యాక్టీరియా ఆధారంగా ఇవి వేగంగా పెరుగుతాయి. సాగు పూర్తయి సీవీడ్‌ను పట్టుబడి చేసిన తర్వాత ఆ నీటిని ఆక్వా సాగుకు కూడా వినియోగించవచ్చు. లేదా తిరిగి సముద్రంలోకి వదిలేయవచ్చు. దీనిలో ఏమాత్రం కాలుష్యం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు.

 

అధిక మోతాదులో ప్రోటీన్లు..

సముద్రపు పాలకూరలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. సాధారణంగా సీ వీడ్స్‌ రకాలు వేలాదిగా ఉంటాయి. వాటిలో ప్రొటీన్లు, ఇతర పోషకాలు అధికంగా ఉన్న 2 రకాలను తాము సాగు చేస్తున్నామని సీకురా అనే సంస్థ సీఈవో ఓజీ చెబుతున్నారు. మటన్లో 25 గ్రాములు, చికెన్లో 21.7 గ్రాములు, కోడిగుడ్డులో 12 గ్రాములు ప్రొటీన్‌ ఉంటుంది. అయితే తాము సాగు చేసే ఉల్వా, గ్రేసిలేరియా రకాల ఉత్పత్తుల్లో 32 గ్రాముల ప్రోటీన్‌ ఉంటుందని ఓజ్‌ చెబుతున్నారు. సముద్రపు పాలకూర అని పిలిచే ఆకు ఈ ఉల్వా రకమే. గ్రేస్ లేరియా రకం.. ముదురు ఎరుపు రంగుతో సున్నితమైన కాడలను కలిగి ఉంటుందని చెప్పుకొచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -