Lord Shiva: శివుడిని ఎటువంటి పూలతో పూజించాలో తెలుసా?

Lord Shiva: భారతదేశంలో హిందువులు ఎక్కువగా కొలిచే దేవుళ్ళను పరమేశ్వరుడు కూడా ఒకరు. ఒక్కో ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో ఆ పరమేశ్వరుని పిలుస్తూ భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. సోమవారం రోజున శివుడిని ప్రత్యేకంగా భక్తి శ్రద్దలతో పూజిస్తూ ఉంటారు. అయితే చాలామంది శివుడికి పూజ చేసే సమయంలో తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. అలా తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల శివుడి ఆగ్రహానికి లోన ఒక తప్పదు. సాధారణంగా మనం శివుడికి బిల్వపత్రం, విభూదితో పూజిస్తూ ఉంటాం.

కానీ సంపదలు మీ సొంతం కావాలి అంటే శివుడికి ప్రత్యేకంగా పువ్వుతో పూజ చేయాలి. మరి ఆ పువ్వు ఏంటి ఆ పువ్వుతో పరమేశ్వరుడికి ఏ విధంగా పూజ చేయాలి అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రమేశ్వరుడిని ప్రతిరోజు ఒక జిల్లేడు పువ్వుతో పూజించడం వల్ల పది బంగారు నాణెములు దానం చేసిన ఫలితం దక్కుతుంది. ఒక గన్నేరు పువ్వు వెయ్యి జిల్లేడు పూలతో సమానం. అలాగే ఒక మారేడు దళం వెయ్యి గన్నేరు పువ్వులతో సమానం. ఒక తామర పువ్వు వెయ్యి మారేడు దళాలతోసమానం. ఒక పొగడ పువ్వు వెయ్యి తామర పువ్వులతో సమానం.

 

ఒక ములక పువు వెయ్యి పొగడ పువ్వులతో సమానం ఒక తుమ్మి పువ్వు వెయ్యి ములక పువ్వులతో సమానం. అలాగే ఒక ఉత్తరేణి పువ్వు వెయ్యి తుమ్మి పువ్వులతో సమానం. ఒక ఉత్తరేణి పూవు వెయ్యి పొగడ పువ్వులతో సమానం. ఒక దర్భ పువ్వు వెయ్యి ఉత్తరేణి పువ్వులతో సమానం. ఒక జమ్మి పువ్వు వెయ్యి దర్భ పువ్వులతో సమానం. అదేవిధంగా ఒక నల్ల కలువ పువ్వు వెయ్యి జమ్మి పువ్వులతో సమానం. వెయ్యి నల్ల కలువ పువ్వులు చేసిన మాలను శివునికి సమర్పిస్తారో వారు కైలాసంలో నివసిస్తారు. మొగిలి మాధవిమల్లి, అడవిమల్లి సన్నజాజి,ఉమ్మెత్త దిరిసెన, సాల, మంకెన పువ్వులను శివ పూజలో వాడరాదు. మిగిలిన పూవులను శివ పూజలో ఉపయోగించవచ్చు.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -