Chiranjeevi-Balayya: చిరంజీవి, బాలయ్యలలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరో తెలుసా?

Chiranjeevi-Balayya: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోన్న పేర్లు రెండే రెండు. అవి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలయ్య. సీనియర్ హీరోలైన వీరు ఏజ్ తో సంబంధం లేకుండా అద్భుతమైన రోల్స్ చేస్తూ ఫ్యాన్స్ కు వినోదాన్ని పంచుతున్నారు. వీరిద్దరూ ఎవరికీ వారే అన్నట్లు ఎందులోనూ తీసిపోరు. ఫ్యాన్స్ కోసం ఏదైనా చేయగలిగే సత్తా వీరిద్దరికే ఉంది. ఈ తరుణంలో ఈ సంక్రాంతికి వీరిద్దరూ పోటీ పడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద వీరిద్దరి సినిమాలు సందడి చేయనున్నాయి.

 

వీర సింహారెడ్డి పేరుతో బాలయ్య వస్తుండగా వాల్తేరు వీరయ్య అనే సినిమాతో చిరంజీవి వస్తున్నాడు. దీంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ అనేది ఉండనుంది. జనవరి 12వ తేదిన గోపీచంద్ డైరెక్షన్ లో బాలయ్య హీరోగా తెరకెక్కిన సినిమా వీరసింహారెడ్డి భారీ అంచనాల మధ్య విడుదల అవ్వనుంది. అంతేకాకుండా ఆ సినిమా రిలీజ్ అయిన 24 గంటలలోపే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన బాబి డైరెక్షన్లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య కూడా విడుదల కావడం విశేషంగా చెప్పాలి. ఈ సినిమాల విడుదల కారణంగా సోషల్ మీడియాలో సరికొత్త వార్ మొదలైందనే చెప్పాలి.

 

ఈ ఇద్దరి సినిమాల్లో కామన్ గా కనిపించేది హీరోయిన్ అనే చెప్పాలి. ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తుండటం విశేషం. తాజాగా శృతిహాసన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను తెలిపింది. చిరంజీవితో డ్యాన్స్ చేయడం కష్టమా లేకుంటే బాలయ్యతో డ్యాన్స్ చేయడం కష్టమా అనే ప్రశ్న ఆమెకు ఎదురైంది.

 

ఇద్దరితో వర్కింగ్ అనుభవం ఎలా ఉందని ఆమె అడగ్గా ఆమె ఏ ఫ్యాన్స్ ని హర్ట్ చేయకుండానే కూల్ గా జవాబులిచ్చింది. ఇద్దరిలోనూ వేర్వేరు జోనర్స్ ఉన్నాయని, మాస్ స్టెప్ వేయడంలో బాలయ్య తోపు అని, క్లాస్ మార్క్ మిక్స్ చేసి కొట్టడంలో చిరంజీవి కేక అంటూ ఆమె బదులిచ్చింది. ఈ సినిమాలు ఒకేసారి విడుదల అవ్వడమే కాకుండా తన కెరీర్ కూ రెండూ ప్లస్ అవుతాయని ఆమె తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -