Mega Heroes: ఈ ముగ్గురు మెగా హీరోలలో గొప్ప హీరో ఎవరో తెలుసా?

Mega Heroes: తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చారు. ఆయన తర్వాత మెగా కాంపౌండ్ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. మెగా నట వారసుడిగా మొదట పవన్ కళ్యాణ్ వచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నటనతో స్టార్ డమ్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. మెగా బ్రదర్ నాగబాబు సైతం పలు సినిమాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి పలు సినిమాలు చేశారు.

 

ప్రస్తుతం ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య అనే సినిమా ద్వారా మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయర తనయుడు రామ్ చరణ్ కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందింది. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ప్రస్తుతం అదే స్థాయిలో సినిమాలు చేయనున్నాడు.

 

డైనమిక్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్నాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమా కూడా త్వరలోనే రానుంది. హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకుంటూ ఉంది. మెగా కాంపౌండ్ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక మార్కెట్ ను సొంతం చేసుకుని దూసుకుపోతున్నారు.

 

ఇకపోతే మెగా హీరోలైన చిరంజీవి, పవన్, చరణ్ లలో ముగ్గురికి ఎవరి ప్రత్యేకతలు వారికి ఉన్నాయి. ఈ ముగ్గురు హీరోలలో ఎవరు గొప్ప అంటే మెగా హీరోలు మాత్రం ముగ్గురు గొప్ప హీరోలే అని, ఎవరినీ తక్కువ చేయలేమని అందరూ చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించి చర్చ నడుస్తోంది. నెటిజన్లు దీనిపై తమదైన శైలిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -