Sharwanand: శర్వానంద్ కు పెళ్లి చేసుకోబోయే లక్కీ గర్ల్ ఎవరో తెలుసా?

Sharwanand: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలు హవా నడిపిస్తున్నారు. చిన్న వయసులో ఎంతో అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. సినిమా రంగానికి చెందిన వాళ్ల జీవితాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి జనాలు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే చాలామంది హీరో, హీరోయిన్ల జీవితంలో ఏం జరుగుతుందనే విషయాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంటారు.

తెలుగులో ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్ లో చాలామందికి పెళ్లిళ్లు కాలేదు.దీంతో పలానా హీరో పెళ్లి ఎప్పుడు, అమ్మాయి ఎవరు అనే వివరాలను జనాలు ఎప్పుడూ ఆసక్తిగా చూస్తుంటారు. టాలీవుడ్ లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న యంగ్ హీరో శర్వానంద్. సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు వేసే దగ్గరి నుండి ఇప్పుడు సోలో హీరోగా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చేలా శర్వానంద్ ఎదిగాడు.

తెలుగులో పెళ్లి కాని కుర్ర హీరోల జాబితాలో ఉన్న శర్వానంద్.. పెళ్లి గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా వెంటనే ప్రభాస్ పెళ్లి తర్వాత నా పెళ్లి అంటూ మాట దాటేస్తుంటాడు. ఈ మధ్యన బాలయ్య హోస్ట్ చేసే ‘అన్ స్టాపబుల్2’కి హాజరైన శర్వా.. అక్కడి కూడా అదే సమాధానం ఇచ్చాడు. అయితే తాజా సమాచారం ప్రకారం శర్వానంద్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం.

చాలా కాలంగా తాను ప్రేమిస్తున్న అమ్మాయిని హీరో శర్వానంద్.. పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు దారితీసింది. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నఓ అమ్మాయితో శర్వా.. చాలాకాలంగా ప్రేమాయణం నడుపుతున్నట్లు తెలుస్తోంది. వర్క్ ఫ్రం హోం కారణంగా ఆ అమ్మాయి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నట్లు తెలుస్తుండగా.. వీరిద్దరి పెళ్లి ఈ ఏడాది కాబోతోందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -