CM YS Jagan: సీఎం జగన్ పాత్రలో స్టార్ హీరో.. ఎవరో తెలుసా?

CM YS Jagan: జనాల మీద సినిమాల ప్రభావం గట్టిగానే ఉంది అంటూ అప్పుడెప్పుడో వచ్చిన మహేష్ బాబు డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అది నిజమే. జనాల మీద సినిమాలు ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. జనాలు రాజకీయాల గురించి అయినా పట్టించుకోరేమో కానీ సినిమాల గురించి మాత్రం పట్టించుకోకుండా ఉండలేరు. అందుకే ఎంతోమంది నిజ జీవితాల ఆధారంగా బయోపిక్ లు సందడి చేస్తుంటాయి.

 

 

ఇక ఏపీ సీఎం జగన్ తనదైన మార్క్ పాలనతో దూసుకెళుతుండగా.. గతంలో ఆయన పాదయాత్ర చేస్తున్న సమయంలో ‘యాత్ర’ సినిమా విడుదలై ఆయనకు బాగా ప్లస్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక వైపు రాజకీయాలు చేస్తూనే, సినిమాలు కూడా విడుదలయ్యేలా చూసుకుంటున్నారు జగన్. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ అనే సినిమా తీయగా.. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైయస్ జగన్ సీఎం అయ్యేంత వరకు జరిగిన కథతో ‘యాత్ర2’ చేయబోతున్నట్లు సమాచారం.

 

 

యాత్ర సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముటి రాజశేఖర్ రెడ్డి పాత్ర చేయగా.. అది భారీ హిట్ అయింది. అందరూ ఆ పాత్రకు మమ్ముటి న్యాయం చేశాడని ప్రశంసల వర్షం కురిపించడం తెలిసిందే. ఇక ఇప్పుడు ‘యాత్ర2’లో వైయస్ జగన్మోహన్ రెడ్డిగా దుల్కర్ సల్మాన్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇందుకోసం దుల్కర్ కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

 

 

దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో నటిస్తే మాత్రం ఆ సినిమాకు భారీ క్రేజ్ వచ్చినట్లే. యాత్ర సినిమా తనకు రాజకీయంగా ఎంతో కలిసి వచ్చిన నేపథ్యంలో యాత్ర2 కూడా ఈ ఎన్నికల్లో తన మైలేజ్ ను పెంచుతుందని జగన్ అనుకుంటున్నారట. అందుకే వరుసగా సినిమాలు వచ్చేలా అన్ని చర్యలు చేపట్టారట. రాంగోపాల్ వర్మ నుండి రెండు సినిమాలు రాబోతుండగా.. యాత్ర2 కూడా వస్తుండటంతో సినిమాల ద్వారా జనాల్లో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. మొత్తానికి జగన్ కు రాబోయే ఎన్నికల్లో ఈ సినిమాలు ఖచ్చితంగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -