Chiranjeevi: చిరంజీవిని అరెస్ట్ చేసిన ఆ టాలీవుడ్ స్టార్ హీరో.. ఏం జరిగిందంటే?

Chiranjeevi: తెలుగు ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి గురించి పెద్దగా పరిచయంకర్లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా చిరంజీవి ఓ వెలుగు వెలుగుతున్నాడు. కుర్ర హీరోలతో సమానంగా సినీ అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకుంటున్నాడు. కాగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ విషయంలో బిజీగా ఉన్నారు.

ఒకవైపు షూటింగ్ నేపథ్యంలో బిజీగా ఉంటూ మరోవైపు రెండు సినిమాల్లో నటిస్తున్నాడు చిరంజీవి. ఈ సినిమాలకు సంబంధించి చిత్రీకరణ కూడా చిరంజీవి త్వరగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తుంది. గాడ్ ఫాదర్ సినిమా తర్వాత, చిరంజీవి బోలా శంకర్ సినిమాతో పాటు బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. డైరెక్టర్ బాబి ఈ సినిమా గురించి ఎంతో సమయం తీసుకుని చిరంజీవికి తగ్గట్టుగా ఈ కథను ప్రేక్షకులకు ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నాడు.

ఇక హీరో రవితేజ కూడా అందులో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలియగానే మెగా అభిమానులు మరింత అంచనాలు పెంచుకున్నారు. ఈ క్రమంలో ఆ సినిమాలో రవితేజ ఎలాంటి పాత్ర పోషిస్తాడు అనే దానిమీద అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఒక వార్త ప్రకారమైతే ఈ సినిమాలో రవితేజ ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవిని రవితేజ అరెస్టు చేసే సీన్ కూడా ఉందట. ఇటీవల వైజాగ్ లో ఈ చిత్రానికి సంబంధించిన చిరంజీవి, రవితేజల మధ్య ఒక క్లాస్ సన్నివేశాన్ని సూట్ చేసినట్లు సమాచారం అందుతుంది. ఈ విషయం గురించి లోకల్ ఫాన్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తో స్టార్ హీరో రవితేజ జతకట్టడంతో ఈ సినిమా గురించి మెగా అభిమానులు మరో స్థాయిలో వేచి చేస్తున్నారు. మరి దసరా కానుకగా విడుదలయ్యి మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -