Tollywood Star Heroes: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో నెంబర్ వన్ హీరో ఎవరో తెలుసా?

Tollywood Star Heroes: తెలుగు రాష్ట్రాల ప్రజలకు టాలీవుడ్ స్టార్ హీరోల గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలు ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఒక రేంజ్ లో హడావిడి చేశారు. అలా వెలిగిన స్టార్ హీరోలు ఇప్పటి ప్రేక్షకులను కూడా నటనతో ఒక రేంజ్ లో మెప్పిస్తున్నారు.

కుర్ర హీరోలతో సమానంగా సినిమా అవకాశాలు అందుకుంటూ అగ్రస్టార్ హీరోలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ఈ స్టార్ హీరోలు. దాదాపు ఆరుపదులు వయసు వచ్చినప్పటికీ ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో హీరోలుగా ఒక రేంజ్ లో హడావిడి చేస్తున్నారు. ఏదేమైనా ఈ స్టార్లు తెలుగు నాట నటనలో తమకంటూ చెరగని ముద్ర ఏర్పరచుకున్నారు. అయితే ఇటీవల ఒక సంస్థ టాలీవుడ్ స్టార్ హీరోలలో నెంబర్ వన్ హీరో ఎవరని ఒక సర్వే చేసిందట.

ఆ సర్వే ప్రకారం సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జునలు కాగా.. వీరిలో నెంబర్ 1 స్థానంలో చిరంజీవి ఉన్నట్లు తెలుస్తుంది. ఇక నెంబర్ 2 స్థానంలో బాలకృష్ణ. వెంకటేష్ నెంబర్ 3 నాగార్జున నెంబర్ 4 స్థానంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా ఈ స్టార్ హీరోలు మాత్రం దాదాపు మూడు దశాబ్దాల ప్రేక్షకులను హీరోలుగా మెప్పించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుత టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అగ్రస్టార్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్నారు.

ఇక నెంబర్ వన్ స్థానంలో ఉన్న చిరంజీవి ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో చిరంజీవి వారసుడు రామ్ చరణ్ ప్రధాన పాత్ర పోషించాడు. అయినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కాగా మెగాస్టార్ అభిమానులు చిరంజీవి తదుపరి సినిమా గాడ్ ఫాదర్ చిత్రంపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా దసరా కానుకగా విడుదలవుతుంది. కాగా ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. చిరంజీవి మాత్రం ఈ సినిమా విషయంలో పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -