Ganesh: అందుకే వినాయకుడిని నీళ్లలో ముంచుతారంట..

Ganesh: గణేష్‌ ఉత్సవాలు వస్తున్నాయంటే ఆ సంబరమే వేరు.. స్త్రీ, పురుషా, చిన్నా పెద్ద తేడా లేకుండా అందరు ఈ వినాయక ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. చిన్న చిన్న బస్తీలు మొదలు కొని పెద్ద పెద్ద పట్టణాల్గో మండపాలు ఏర్పాటు చేసి గణపయ్యల ప్రతిష్టిస్తారు. పది రోజుల పాటు రోజూ ప్రత్యేక పూజలు నిర్వహించిన 11వ రోజుల శోభాయాత్రలో డ్యాన్సులతో ఊరేగిస్తూ నిమజ్జనం చేస్తారు. ప్రస్తుతం గల్లీ నుంచి ఢిల్లీ వరకు గణేష్‌ నవరాత్రి ఉత్సవాల్లో భక్తులంతా మునిగిపోయారు. దేశవ్యాప్తంగా రేపు (శుక్రవారం) నిమజ్జనాలు కానున్నాయి. అందుకోసం మండపాల నిర్వాహకులు, సమితి సభ్యులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. పది రోజులుగా భక్తిశ్రద్ధలతో గణపయ్యకు పూజలు చేసి 11వ రోజు అలా నిమజ్జనం ఎందుకు చేస్తారు.. దానికి గల కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం.

ఉత్సవాలను భాద్రపద మాసంలోని శుక్లపక్షం చతుర్ధి తిథి నాడుప్రారంభిస్తారు. అలా 10 రోజుల తర్వాత చతుర్దశినాడు ప్రవహిస్తున్న నది, చెరువు, కుంటల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తారని అందరికీ తెలుసు. అసలు అలా ఎందుకు నిమజ్జనం చేస్తారో చాలా మందికి తెలిదు. గణపతి చతుర్ధి రోజు ప్రతిమను ప్రదర్శించే సమయంలో వివిధ పూజలు నిర్వహిస్తారు. నాటి నుంచి భక్తులు తమ తమ కోరికలను నెరవేర్చాలని గణపతి చెవుల్లో చెబుతుంటారు. అనంనతరం వినాయకుడిని చెరువులు, నదులు, నీటి కుంటల్లో నిమజ్జనం చేస్తారు. ఈ విధంగా బొజ్జ గనపయ్య భూలోకం నుంచి దేవతాలోకానికి వెళ్తాడు.

అక్కడి వెళ్లిన తర్వాత గణపతి భూలోకంలో భక్తులు చెప్పిన కోరికలను దేవతలతో చెప్పి నెరవేరుస్తాడనే నమ్మకం. ఇదే కాక వేదవ్యాసుడు మహాభారతం స్టోరీని గణేష్‌ చతుర్దశి నుంచి చివరి వరకు పది రోజుల పాటు చెబుతారు. ఇలా కథ విన్నన్ని రోజులు గణేశుడు కళ్లు తెర్చుకొని ఉండటంతో ఆ కథ ప్రభావం గణేషుని పై పడి అతనికి జ్వరం వచ్చేసి శరీరం వేడుక్కుతోంది.దీంత సమీపంలోని చెరువులు, కుంటల్లో గణుషుడిని ముంచితే వినాయకుడి వేడి తగ్గుతుందని భక్తుల నమ్మకం

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -