Lakshmi: సంపదకు లక్ష్మీని ప్రతీకగా ఎందుకు భావిస్తారో తెలుసా?

Lakshmi: జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక సమస్యలు లేకుండా డబ్బు బాగా సంపాదించి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. అయితే కొంతమంది ఎంత డబ్బు సంపాదించినప్పటికీ కలలు నెరవేరకపోగా సంపాదించిన డబ్బు మొత్తం అంతా ఖర్చవ్వడంతో పాటు అదనంగా అప్పులు కూడా చేస్తూ ఉంటారు. ఆర్థిక పరిస్థితి బాగా ఉండాలి అంతే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి. లక్ష్మి అనుగ్రహం ఉంది అంటే చాలు మనకు ఎటువంటి లోటు ఉండదని చెప్పవచ్చు.

 

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది. అయితే చాలామంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కోసం లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. మరి డబ్బు కోసం, సిరిసంపదల కోసం లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలి? ఈ సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది. మరి సిరి సంపదలకు లక్ష్మీదేవిని పూజించడం వెనుక ఉన్న కారణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పుట్టుకకు అనేక కథలు ఉన్నాయి. లక్ష్మి దేవి సిరి సంపదలు, సుఖ శాంతులు ప్రసాదించే దేవతగా కొలవడం వెనుక ఒక చరిత్ర కూడా ఉంది.

కాగా విష్ణు పురాణం ప్రకారం.. దుర్వాస మహర్షి కల్పవృక్ష మాలను దేవేంద్రుడికి బహుకరిస్తారు. దేవేంద్రుడు ఆ మాలను తన వాహనమైన ఏనుగుకు వేసాడు. ఆ ఏనుగు ఆ మాలను క్రింద పడవేసి కాళ్లతో తొక్కుతుంది. దాంతో కోపోద్రిక్తుడైన దుర్వాసుడు నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్లిపోవుగాక అని శపించాడు. దాంతో స్వర్గ లోకంలో నిర్వీర్యం అయ్యింది. ఐశ్వర్యం నశించి పోయింది. ఇదే సమయంలో రాక్షసులు స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంద్రుడు, ఇతర దేవతలు బ్రహ్మ దేవుడి వద్దకు వెళ్లి జరిగిన విషయాలు వివరిస్తారు.

 

ఆ తర్వాత బ్రహ్మ దేవుడు విష్ణువు దగ్గరికి దేవుళ్లను వెంటబెట్టుకుని పరిష్కారం అడగగా చెబుతాడు.

అమృతాన్ని స్వీకరించి బలాన్ని పొంది రాక్షసులను ఓడించవచ్చని మళ్ళీ సిరి సంపదలను పొందవచ్చని సలహా ఇస్తాడు. దేవతలు క్షీర సాగరంలో సముద్రాన్ని మథనం చేసారు. సముద్ర మథనం నుండి హాలాహారం, కామధేనువు, తెల్లని అశ్వం, ఐరావతం, కల్పవృక్షం, అమృతంతో పాటు లక్ష్మి దేవి కూడా కనిపిస్తుంది. ఆ సందర్భంగా లక్ష్మి దేవిని శ్రీ మహావిష్ణువు ను వరిస్తుంది. ఇంద్రలోకంలో సిరిసంపదలు తిరిగి వస్తాయి. అప్పటి నుండి లక్ష్మి దేవి నుండి సంపద, వైభవం ప్రతీకగా కొలుస్తారు.

 

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -