Masculinity: పురుషుల్లో మగతనం ఎందుకు తగ్గుతుందో తెలుసా?

Masculinity: చాలామంది పురుషులకు మగవాళ్లలో కూడా హార్మోలలో మార్పులు వస్తాయి అన్న విషయం తెలియదు. హార్మోన్ల తేడావల్ల కేవలం మహిళల శరీరంలోనే కాకుండా పురుషుల శరీరంలోనూ మార్పులు వస్తాయి. మహిళల్లో టీనేజ్ లో ప్రారంభమైన రుతుచక్రం ఓ నిర్ధిష్ట వయసుకు వచ్చేసరికి ఆగిపోతుంది. దాన్నే మెనోపాజ్ అంటారు. ఈ మెనోపాజ్ మహిళల్లో ఊబకాయం, శరీరంలో వేడి ఆవిర్లు, విపరీతమైన మూడ్ స్వింగ్స్, వంటి వాటికి దారితీస్తాయి. ఇటువంటి సమస్యలు కేవలం మహిళల్లోనే కాకుండా పురుషుల్లో కూడా కనిపిస్తాయి. 50 ఏళ్ళ తరువాత పురుషుల్లో ఈ హార్మోన్ల మార్పులు కనిపిస్తాయి.

అయితే అది స్త్రీలలో కంటే చాలా భిన్నంగా ఉంటుంది. మగవాళ్లలో కనిపించే ఈ హార్మోనల్ చేంజెస్ ని ఆండ్రోపాట్ అంటారు. దీనివల్ల పురుషుల శరీరంలో టెస్టోస్టిరాన్ స్థాయి తగ్గిపోతుంది. ఇది పురుషుల్లో మగతనానికి అత్యంత ముఖ్యమైన హార్మోన్. పురుషుల్లో యుక్త వయసు మార్పులకు ఈ హార్మోనే ప్రధాన కారణం. మంచి లైంగిక సామర్థ్యానికీ మూలం ఈ హార్మోనే. టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గి ఆండ్రోపాజ్ దశకు చేరుకున్నామన్న విషయాన్ని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. అనుకోకుండా ఊబకాయం వస్తుంటే ఇది ఆండ్రోపాజ్ లక్షణం కావచ్చు. ఎందుకంటే టెస్టోస్టిరాన్ స్థాయి తగ్గినప్పుడు శరీరంలో కొవ్వు పరిమానం పెరుగుతుంది.

 

అయితే తరచూ అలసటగా ఉండడం, రాత్రి పూట సరిగా నిద్ర పట్టకపోవడం కూడా ఈ లక్షణాల్లో ఒకటి. టెస్టోస్టిరాన్ తగ్గడంతో కార్టిసాల్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల ఒత్తిడి, నిద్రలేమి, ఆందోళన పెరుగుతాయి. టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ పురుష పునరుత్పత్తి వ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఈ హార్మోన్ స్థాయి తగ్గడంతో, స్పెర్మ్ సంఖ్యను, స్పెర్మ్ మోటిలిటీ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా మగతనం తగ్గుతుంది. టెస్టోస్టెరాన్‌ తగ్గడం వల్ల జుట్టు రాలిపోయి బట్టతల వస్తుంది. రొమ్ముల్లో మార్పులు వస్తాయి. మగవాళ్లలో రొమ్ములు చదునుగా ఉండడానికి ఈ హార్మోనే కారణం.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -