Whatsapp: వాట్సాప్ లో ఈ ఫీచర్లను మీరు ఉపయోగిస్తున్నారా లేదా తెలుసుకోండి?

Whatsapp: ప్రస్తుత రోజుల్లో పదిమందిలో 8 మంది స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. దీంతో స్మార్ట్ ఫోన్ల వినియోగంతో పాటు వాట్సాప్ వినియోగం కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఇక ఇప్పటికే వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంది వాట్సాప్ సంస్థ. గత ఏడాదితో పాటు ఈ ఏడాది కూడా ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా ఎమోజీతో రిప్లే ఇవ్వడం, వాట్సప్‌లో కమ్యూనిటీ గ్రూపులు ఏర్పాటుచేసుకోవడం..

ఆన్‌లైన్‌లో ఉన్నట్లు తెలియకుండానే చాట్‌ చేయడం వంటి మంచి మంచి ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ లో వినియోగదారుడికి అవతలి వ్యక్తి ఏదైనా సందేశం పంపినప్పుడు ఎమోజీలతో వాటికి మన స్పందన తెలియజేయవచ్చు. అయితే మనకు వచ్చిన సందేశాన్ని సెలక్ట్‌ చేస్తే ఎమోజీతో స్పందించేందుకు కేవలం ఆరు మాత్రమే కనిపిస్తాయి. చాలా మంది ఈ ఆరింటిలో ఒకటి మాత్రమే పంపించగలమా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. కాని ఆరు చిహ్నాలే కాకుండా దాని పక్కన ఉన్న ప్లస్‌ బటన్ నొక్కడం ద్వారా మరిన్ని ఎక్కువ ఏమోజీలు కనిపిస్తాయి. అదేవిధంగా సందర్భాన్ని బట్టి అవసరమైన ఎమోజీ ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. మరొకటి వాట్సప్‌లో కమ్యూనిటీ గ్రూపులు. వాట్సాప్ లో కమ్యూనిటీ గ్రూపులను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

సాధారణంగా ప్రతి వాట్సప్ వినియోగదారుడు కమ్యూనిటీ గ్రూపులను క్రియేట్ చేయవచ్చు. ఒక ప్రదేశంలో ఉన్న వారంతా ఒక కమ్యూనిటీ గ్రూప్ ని క్రియేట్ చేసుకుని ఆ గ్రూప్ ద్వారా ఒకే విషయాన్ని అందరికీ షేర్ చేయవచ్చు. అదేవిధంగా ఆన్లైన్లో ఉన్నట్టు తెలియకుండా చాటింగ్ చేయడానికి, సాధారణంగా ఎవరైనా వాట్సాప్ లో ఉపయోగిస్తున్న సమయంలో ఆ వ్యక్తి ఆన్లైన్లో ఉన్నట్టు చూపిస్తుంది. కానీ ఆన్లైన్లో ఉన్న ఉన్నట్టు తెలియకుండా చాట్ చేసుకునే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే సెట్టింగ్స్‌లో ఆప్షన్‌లలో మార్పు చేసుకోవాలి.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -