Chiranjeevi-Balayya: చిరంజీవి, బాలయ్య మాస్ పవర్ దిల్ రాజుకు అర్థమవుతుందా?

Chiranjeevi-Balayya: సంక్రాంతికి కానుకగా రెండు భారీ సినిమాలు విడుదల కానున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హోరా హోరీగా పోటీ పడటం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ రెండు సినిమాలతో కలిపి దిల్ రాజ్ నిర్మిస్తున్న వారసుడు సినిమా కూడా సందడి చేయనుంది.

 

దిల్‌ రాజు తాను నిర్మించిన సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో పాగా వేశాడు. ఆరు నెలల క్రితమే తన వారసుడు సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను బుక్ చేయడం ఇప్పుడు చిరంజీవి, బాలయ్య సినిమాలకు మైనస్ అవుతోంది. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలకు గాను తన వారసుడు సినిమా కంటే కూడా తక్కువ థియేటర్లను ఆయన కేటాయించడం వల్ల ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

దిల్‌ రాజు కావాలని మైత్రి మూవీ మేకర్స్ పై చిరు, బాలయ్యల సినిమాలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాడని సోషల్ మీడియా వేదికగా పలు ఆరోపణలు వస్తున్నాయి. చిరు, బాలయ్య సినిమాలకు సరైన థియేటర్లను ఇవ్వకపోవడంతో పాటు వారసుడు సినిమాకు మెయిన్ థియేటర్లను, క్రేజ్ ఉన్న థియేటర్లను ఇవ్వడం ఏంటని అందరూ ప్రశ్నిస్తున్నారు.

 

దిల్ రాజు వ్యవహారాన్ని బట్టి చూస్తూ ఉంటే ఇది ముందు ముందు చాలా దూరం వెళ్లే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. నైజాం ఏరియాలో మెజార్టీ థియేటర్లు దిల్ రాజు ఆధీనంలో ఉన్నాయని, అందుకే వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలకు కచ్చితంగా డ్యామేజీ తప్పదని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు తీరుకు త్వరలోనే బాలయ్య, చిరు బుద్ది చెప్పే అవకాశం కూడా ఉంటుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా దిల్ రాజు సినిమాను వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలు తొక్కేస్తాయని ఫ్యాన్స్ ఖరాకండీగా చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -