Lemon juice: నిమ్మరసం ఎక్కువగా తాగుతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు?

Lemon juice: సాధారణంగా చాలామంది నిమ్మరసంని ఎక్కువగా తాగుతూ ఉంటారు. మరి ముఖ్యంగా ఎండాకాలంలో ఈ నిమ్మ రసాన్ని ఎక్కువగా సేవిస్తూ ఉంటారు.. నిమ్మరసం తాగడం వల్ల అది శరీరానికి కావాల్సిన అంత శక్తిని అందిస్తుంది.. నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అందుకే ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు చాలా మంది నిమ్మరసం తీసుకోమని చెబుతూ ఉంటారు. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడంతోపాటు యాక్టివ్ గా ఉండడానికి తోడ్పడుతుంది. అయితే చాలామంది వేసవి చలికాలం అని కాలంతో సంబంధం లేకుండా తరచుగారి నిమ్మరసం తాగుతూ ఉంటారు.

నిమ్మరసం తాగడం మంచిదే కానీ అలా అని శృతిమించి తాగితే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు. మరి నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నిమ్మరసం ఎక్కువగా తాగితే ముందుగా దంతాలు దెబ్బతింటాయి. లెమన్ వాటర్‌లో ఎసిడిక్ యాసిడ్ ఉంటుంది. అది ముందుగా దంతాల పై ప్రభావం చూపిస్తుంది. నిమ్మరసం ఎక్కువైతే అల్సర్లు, ACDT సమస్యలు, కడుపునొప్పి వస్తాయి. దాంతో పొట్టలో వేడి, వికారం, వామ్టింగ్స్ వస్తున్నట్లు అవుతుంది.

 

నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వలన మూత్రాశ‌యం అధికంగా ప‌నిచేయాల్సి వ‌స్తుంది. దీనితో దానిపై అధిక ఒత్తిడి పడి మూత్రాశ‌య వ్యాధులు వస్తాయి..నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వలన దంతాల పైనే కాకుండా చిగుళ్లకు కూడా ప్రమాదమే నిమ్మరసం ఎక్కువగా తాగితే కూడా చిగుళ్లు పాడైపోతాయి. కొంతమందికి నిమ్మరసం తాగితే తలనొప్పి కూడా వస్తుంది. కొంతమందికి నిమ్మరసం తాగడం వల్ల జీర్ణ సంబంధించిన సమస్యలు కూడా తలెత్తవచ్చు. కాబట్టి నిమ్మరసం తాగడం మంచిదే కానీ అధికంగా అసలు తీసుకోకూడదు.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -