Prabhas: ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా.. తేల్చేసిన ప్రభాస్!

Prabhas: టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాసే. తన తోటి హీరోలు పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటి వాళ్లు అయ్యారు. కానీ ప్రభాస్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండానే ఉన్నారు. ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా? ఎప్పుడు సెలబ్రేషన్స్ చేసుకుందామా? అని అటు కుటుంబీకులు, ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. సాధారణంగా ఇండస్ట్రీలో ఏ హీరో అయినా పెళ్లి చేసుకోకుండా ఉంటే.. అతనిపై రూమర్స్ స్ప్రెడ్ అవ్వడం కామన్. ప్రభాస్‌పై కూడా చాలానే రూమర్స్ వచ్చాయి. గతంలో పలువురు హీరోయిన్లతో ప్రేమలో ఉన్నాడని ప్రచారం కూడా జరిగాయి. కానీ అవన్నీ పుకార్లేనని ఆయన కొట్టిపడేశారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి ప్రభాస్ పెళ్లి వార్త తెరపైకి వచ్చింది.

 

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్-2’. ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా ఈ షో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోకి యంగ్ హీరోలు, టాలీవుడ్ సెలబ్రిటీలు, పొటికల్ లీడర్లు వచ్చి సందడి చేశారు. తాజాగా ఈ షోకి రెబల్ స్టార్ ప్రభాస్ రానున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ ఆహా కూడా ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. అయితే బాలయ్యతో ఇంటర్వ్యూలో ప్రభాస్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం ఎవరితో రిలేషన్‌షిప్‌లో లేనని, తన పెద్దమ్మ శ్యామలాదేవి చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పినట్లు సమాచారం.

 

 

కాగా, ప్రభాస్-కృతిసనన్‌పై నేషనల్ మీడియా రాస్తోన్న వార్తల గురించి ప్రతిఒక్కరికీ తెలిసిందే. ఆదిపురుష్ ఎఫెక్ట్ తో ప్రభాస్-కృతి సనన్‌పై రూమర్లు రాయడం జరుగుతోంది. కృతిసనన్ ప్రభాస్‌పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ బాలీవుడ్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’లో కరణ్ జోహార్‌తో ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు ఈ భామ పేర్కొంది. వీరిద్దరికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ప్రభాస్ ఎవర్నీ పెళ్లి చేసుకుంటాడో?.. మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే..

 

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -