Kajal Aggarwal: కాజల్ ఇలాంటి బూతులు మాట్లాడుతుందా.. ఈ విషయాలు తెలుసా?

Kajal Aggarwal: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్ష్మి కళ్యాణం సినిమాతో తొలిసారిగా కాజల్ తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తరువాత మెగా హీరో రామ్ చరణ్ నటించిన మగధీర సినిమాలో హీరోయిన్గా నటించినది. ఇక ఈ సినిమాతో తను మంచి సక్సెస్ అందుకుంది. తరువాత వరుస సినిమాలతో దూసుకెళ్తూ స్టార్ హోదాకు చేరుకుంది.

 

మంచి హోదాలో ఉన్న సమయంలో తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లూను ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ మధ్యనే బాబుకు జన్మనిచ్చింది. ఇక మళ్లీ మునుపటిలా కనిపించడానికి బాగా వర్క్ అవుట్ లు కూడా చేస్తుంది. ఇక ఇండస్ట్రీకి మళ్ళీ రీఎంట్రీ కూడా ఇచ్చింది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా కాజల్ అగర్వాల్ మాట్లాడిన బూతు డైలాగు గురించి బాగా వైరల్ అవుతుంది.

ఇంతకు అసలు విషయం ఏంటంటే.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బిజినెస్ మాన్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు తో పాటు కాజల్ అగర్వాల్ కూడా నటించింది. అయితే మామూలుగా పూరి జగన్నాథ్ సినిమాలలో డైలాగులు కాస్త బోల్డ్ గా కూడా ఉంటాయి.

 

అయితే ఆ సినిమాలోని కోసి కారం పెడతా నా కొడకా అనే డైలాగు ఉండగా.. పూరి జగన్నాథ్ ఆ డైలాగును కాజల్ తో సులువుగా చెప్పించాడట. కాజల్ కూడా ఆ డైలాగును సులువుగా చెప్పేసిందట. అంత సులువుగా ఆమె డైలాగ్ చెప్పడంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారని తెలిసింది. కానీ ఆ డైలాగు సినిమాలో పెట్టలేదట డైరెక్టర్. కారణం ఏంటంటే ఆ డైలాగు బయటికి వస్తే మహేష్ బాబు ఫ్యాన్స్ హర్ట్ అవుతారని.. అందుకే ఆ డైలాగుని ఎడిటింగ్ లోని తీసేసారని తెలిసింది. ఒకవేళ ఆ డైలాగు బయటికి వస్తే మాత్రం పూరి జగన్నాథ్ కెరీర్ కు అప్పుడే పుల్ స్టాప్ పడేది.

Related Articles

ట్రేండింగ్

Roja: నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిలా మారిన రోజా.. శత్రువులే తప్ప మిత్రులు లేరా?

Roja:  నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి రోజా ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిగా మారిపోయారు. ఈమె 2014 ఎన్నికలలో వైసిపి నుంచి గెలుపొందారు. అలాగే 2019 సంవత్సరంలో కూడా 2...
- Advertisement -
- Advertisement -