Samantha: చెప్పుకోలేని సమస్యలతో బాధ పడుతున్న సమంత.. ఇదే నిజమా?

Samantha: టాలీవుడ్ ప్రేక్షకులకు అందాల తార సమంత గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో తక్కువ సినిమాల్లో నటించి చాలా ఎక్కువ సినిమాలకు కలిగే క్రేజ్ సమంత తన సొంతం చేసుకుంది. ఇక సమంత తన అందంతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది. అలా పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది సమంత.

ఇక ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమాతో సమంత వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఇండస్ట్రీలో హడావిడి చేస్తుంది. ఏదేమైనా సమంతకు విడాకులు జరిగిన తర్వాత కెరీర్ పరంగా బాగా దూసుకు వెళుతుంది. వరల్డ్ వైడ్ గా సినిమా అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతుంది. ఇక సమంత సోషల్ మీడియాలో కూడా యమా ఆక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్స్ నెట్టింట్లో పంచుకుంటుంది.

ఈ క్రమంలో సమంత సోషల్ మీడియాలో కూడా పలు పుకార్లను ఎదుర్కొంటుంది. అదేమిటంటే సమంతకు ఏదో స్కిన్ డిసీజ్ వచ్చిందని దాని కారణంగానే బయటకు రావడం లేదని, అందుకని శాకుంతల మూవీ షూటింగ్ కి కూడా బ్రేక్ ఇచ్చిందని కొందరు పుకార్లు రేపారు. కాగా ఈ విషయం గురించి సమంత పర్సనల్ మేనేజర్ స్పందించాడు. సమంతకి అలాంటి సమస్యలు ఏమీ లేవని ప్రస్తుతం తను ఆరోగ్యంగా చాలా బాగుందని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.

కానీ తాజాగా సమంత గురించి నెట్టింట్లో మరో వార్త చక్కర్లు కొడుతుంది. సమంత చెప్పుకోలేని సమస్యతో లోపల ఎంతో బాధపడుతున్నారని, అందుకే శాకుంతలం సినిమా కూడా వాయిదా పడిందని అనుకుంటున్నారు. కాగా సమంత మీడియా ముందుకు రావడానికి కూడా ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. మరి ఈ విషయం గురించి సమంత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. తనపై వచ్చే వార్తలు గురించి ఇంతవరకు స్పందించని సమంత.. ఈ వార్తల కైనా స్పందిస్తుందో లేదో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -