Tarak: ఆ హీరో పేరు వింటే తారక్ మండిపడుతున్నారా?

Tarak: జూనియర్ ఎన్టీఆర్ అంటే నటనకు పర్యాయపదం, సూపర్ డూపర్ హిట్లకు కేరాఫ్ అడ్రస్. నందమూరి గౌరవాన్ని నిలబెట్టేలా ఎన్టీఆర్ వ్యవహారశైలి ఉంటుంది. ఆన్ స్క్రీన్ పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా తనదైన శైలితో అశేషమైన అభిమానులను సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్. తన మొదటి సినిమా నుండీ తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందిన హీరో తారక్. అయితే ఈ మధ్య ఒక స్టార్ హీరో పై ఎన్టీఆర్ కోపంగా ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇంతకీ ఎందుకు ఆ హీరోపై ఎన్టీఆర్ గుర్రుగా ఉన్నారో తెలుసా?

 

ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచం నివ్వెరపోయే ప్రదర్శన కనబర్చిన తారక్.. తర్వాతి ప్రాజెక్టుపై ఇంకా క్లారిటీ రాలేదు. దర్శక ధీరుడు జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ చాలా గొప్ప విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ఆస్కార్ కూడా ఈ సినిమాను వరిస్తుందంటూ చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇంత గొప్ప విజయం సాధించిన ఈ సినిమాలో తారక్ నటన హైలెట్. ముఖ్యంగా కొమురం భీముడో పాటలో ఎన్టీఆర్ హావభావాలు మాములుగా ఉండవు. ప్రతి ప్రేక్షకుని రోమాలు నిక్కబొడిచేలా తన యాక్టింగ్ ఉంటుంది.

 

అయితే ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఒక స్టార్ హీరోపై కోపంగా ఉన్నారని సమాచారం. ఆ స్టార్ హీరో వల్ల ఒక క్రేజీ ప్రాజెక్ట్ మిస్ కావడంతో ఆ హీరో తెగ ఫీలవుతున్నారని తెలుస్తోంది. తన తర్వాతి ప్రాజెక్టుకు సంబంధించి వస్తున్న వార్తల్లో ఈ విషయం ట్రేండింగ్ గా మారింది. ఆ హీరో వల్లే మంచి క్రేజీ ప్రాజెక్టు జూనియర్ ఎన్టీఆర్ కోల్పోయాడట. దీనితో ఎంతో ఫీల్ అయిన ఎన్టీఆర్ ఆ హీరోపై కోపంగా ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తర్వాతి ప్రాజెక్టు గురించి అటు అభిమానుల్లోనూ, ఇటు సినీ వర్గాల్లోనూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే ప్రాజెక్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తారక్ తర్వాతి ప్రాజెక్టులో కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడని తెలుస్తోంది. ఏదేమైనా అభిమానులను ఇంతగా వేచి చూసేలా చేస్తున్నారు ఎన్టీఆర్. దీనితో అభిమానులకు మరింత నిరీక్షణ తప్పదనే అనిపిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -