Nagarjuna: ఆ హీరో నాగార్జునను ఒరేయ్ అని పిలుస్తాడా?

Nagarjuna: సినీ ఇండస్ట్రీలో మంచి స్నేహితులు ఎంతో మంది ఉంటారు. అందులో కొందరు బెస్ట్ ఫ్రెండ్స్ గా కూడా ఉన్నారు. స్టార్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ఇలా చెప్పుకుంటూ పోతే మంచి బాండింగ్ ఉన్నవారు చాలా మందే ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో కొందరి స్నేహం ఎంతో చెరిగిపోని బంధంగా కూడా కొనసాగుతూ ఉంది. ఆనాటి రోజుల్లో ఎన్టీఆర్ ఏఎన్నార్ మంచి స్నేహితులని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాతి తరంలో నాగార్జున – బాలకృష్ణ కూడా అదే ఫ్రెండ్ షిప్ తో ముందుకు సాగుతున్నారు.

 

మెగాస్టార్ చిరంజీవి – నాగార్జున, సుకుమార్ – అల్లు అర్జున్, ప్రభాస్ – గోపీచంద్, పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు లాగా చాలా మంది మంచి స్నేహితులు సినీ పరిశ్రమలో ఉన్నారు. అయితే అలా మంచి ఫ్రెండ్స్ గా ఉండి విడిపోయిన హీరోలే నాగార్జున – వెంకటేష్ కూడా అని కొందరు అంటున్నారు. వెంకటేష్ సిస్టర్ ని నాగార్జున పెళ్లి చేసుకుని విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల నాగార్జున ఆమెకు విడాకులు కూడా ఇచ్చేశాడట. నాగ్ తో అంతకుముందు వెంకీతో మంచి స్నేహం ఉండేదట. అయితే వారి పెళ్లి గొడవల వల్ల వీరి ఫ్రెండ్షిప్ చెడిందని అంటున్నారు.

అప్పట్లో నాగ్, వెంకీ చాలా చనువుగా ఉండేవారని, నాగార్జున ఏకంగా వెంకటేష్ ని ఒరేయ్ అని పిలిచే అంత చనువుతో కలిసిమెలిసి ఉండేవారట. పెళ్లిలో కూడా వీరిద్దరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారట. అయితే పెళ్లి తర్వాత నాగచైతన్య పుట్టిన తర్వాత కూడా వీళ్ళ మధ్య అదే బాండింగ్ ఉండేదని, నాగార్జున వెంకటేష్ ని ఒరేయ్ అని అనేవారని, కానీ విడాకుల తర్వాత ఆ స్నేహం తగ్గిందని టాలీవుడ్ సమాచారం.

 

అప్పటి నుంచి నాగార్జున, వెంకటేష్ మాట్లాడుకోవడమే మానేశారని, ఇప్పటికి ఆ కోల్డ్ వార్ జరుగుతుందని సోషల్ మీడియా లో వార్తలు షికారు చేస్తున్నాయి. ఏదేమైనా సరే ఒక పెళ్లి రెండు కుటుంబాలను కలిపినట్టుగా ఒక విడాకుల ఘటన ఇద్దరి మంచి ఫ్రెండ్స్ ని విడదీసిందంటూ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. వీరు మళ్లీ కలిసిపోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -