BJP Leader: ఈ బీజేపీ లీడర్ కు బుద్ధుందా.. మత ప్రస్తావన అవసరమా?

BJP Leader: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలామంది ఈ దుర్ఘటనమైన సంఘటన నుంచి కోలుకోలేకపోతున్నారు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఇది ఎవరో ప్లాన్ ప్రకారం చేశారంటూ అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

 

ఈ ఘోరమైన రైలు ప్రమాదంలో 280 మంది మరణించగా 900కు పైగా గాయపడి హాస్పిటల్లో చేరారు. అయితే రోజురోజుకీ మరణించే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే వస్తుంది. అయితే సాంకేతిక లోపమే ఈ ప్రమాదానికి అసలు కారణం అని కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ఈ సంఘటన మీద చాలా సెలబ్రిటీలు మాట్లాడుతూ వారి పరామర్శలు తెలిపారు.

 


మిగిలిన కొంత మంది దీని వెనకాతల రాజకీయ కుట్ర జరుగుతుంది అని కూడా చెప్పారు. ఇది ఇలా ఉండగా ఈ ఘోర ప్రమాదంపై కర్ణాటక బీజేపీ మహిళా నాయకురాలు హెచ్ఎస్. శకుంతల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ప్రమాదానికి కారణం ప్రమాద స్థలంలో ఎదురుగా ఉన్న మసీద్ అని తెలిపారు.

 

తర్వాత చాలా కాంట్రవర్సీలు రావడంతో ఆ పోస్ట్ ని తను డిలీట్ చేశారు. కానీ కొన్ని మంది వీటిని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయింది. దీనికి ఒడిశా పోలీసులు జవాబు ఇస్తూ ఇలా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

అది మసీదు కాదని ఇస్లాం టెంపుల్ అని కూడా తెలిపారు కొన్ని మంది కావాలనే ఒక సైడ్ నుంచి ఫోటో తీస్తూ దాన్ని మసీదుల చూపిస్తున్నారని ఇలాంటి తప్పుడు వార్తలు ఇస్తే శిక్ష పడతది అని కూడా పోలీసులు తెలిపారు. ఈ విషయం గురించి హెచ్చరిస్తూ ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేశారు ఒడిషా పోలీసులు.

 

అదేవిధంగా తప్పుడు ప్రచారం చేసిన బిజెపి మహిళ నాయకురాలు హెచ్ఎస్. శకుంతల దగ్గర కూడా వివరణ తీసుకొనున్నట్టు సమాచారం. ఇది ఇలా ఉండగా జరిగిన రైలు ప్రమాదం వెనక కొన్ని మంది కుట్ర ఉన్నదని అలాగే కొన్ని మందిని అనుమానిస్తున్నారని సరైన ఆధారాలతో నిరూపిస్తాము అని కూడా రైల్వే అధికారులు వెల్లడించారు. మరి ఈ కథ ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -