Virginity: హస్త ప్రయోగానికి వర్జినిటీకి సంబంధం ఉందా?

Virginity: హస్త ప్రయోగం.. పెళ్లి కానీ పెళ్లయిన చాలామంది స్త్రీ,పురుషులు వారిలోని లైంగిక కోరికలను ఈ హస్తప్రయోగం ద్వారా అనిచి పెట్టుకుంటూ ఉంటారు. కేవలం పురుషులు మాత్రమే కాకుండా స్త్రీలు కూడా హస్తప్రయోగం చేసుకుంటూ ఉంటారు. కొందరు వారిలోనే లైంగిక కోరికలను అనుచుకోలేక రోజుల్లో నాలుగైదు సార్లు కూడా హస్త ప్రయోగం చేస్తూ ఉంటారు. దీనివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని,కీళ్ల నొప్పులు రావడం, కళ్లకింద నల్లటి మచ్చలు ఏర్పడటం, శరీరమంతా నీరసంగా ఉండటం లాంటివి దీని వల్లే జరుగుతున్నాయని చాలా మంది భావిస్తుంటారు.

కానీ అవన్నీ వట్టి అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు. హస్త ప్రయోగం పై ఉన్నన్ని అపోహలు మరేదానిపై కూడా లేవంటున్నారు. హస్త ప్రయోగం వల్ల సెక్స్‌ జీవితానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. చాలా మందికి హస్తప్రయోగం వల్ల పెళ్లికాని వారు వర్జినిటీ కోల్పోయే అవకాశం ఉందని నమ్ముతుంటారు. అది కూడా వట్టి అపోహ మాత్రమే. కేవలం స్త్రీ అంగం లోకి పురుషుడి అంగం చొచ్చుకుపోయినప్పుడు మాత్రమే వర్జినిటీ కోల్పోతారని, అలా జరగనప్పుడు వర్జినిటీ కోల్పోయే అవకాశమే ఉండదని చెబుతున్నారు నిపుణులు.

 

చాలా మంది యువతులకు చిన్నప్పటి నుంచే సైకిల్ తొక్కడం, స్కిప్పింగ్ ఆడటం, పరుగు పందేలలో పాల్గొనడం లాంటివి చేస్తుంటారు. అలా చేసేవారికి మాత్రం కన్నెపొర చిరిగిపోతుంది. అంతే తప్ప వారి వర్జినిటీ మాత్రం అలానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయం పట్ల చాలామంది పురుషులకు అనేక రకాల సందేహాలు అపోహలు, భయాలు కూడా ఉన్నాయి. చాలామంది పురుషులు మొదటిసారి భాగస్వామితో సెక్స్ లో పాల్గొన్నప్పుడు బ్లడ్ రాకపోతే అప్పుడు అనేక రకాల అనుమానాలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా కేవలం ఒట్టి అపోహలు మాత్రమే.

 

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -