Devotional: మీకు పిల్లలు లేరా.. ఆ గుడిలో చేయాల్సిన పూజ ఏంటంటే?

Devotional: కొన్ని వినడానికి చాలా వింతగా ఆశ్యర్యంగా అనిపిస్తుంటాయి. మనుషుల మాదిరిగా విగ్రహాలు కూడా ప్రవర్తిస్తాయంటే ఆ దేవుని మహిమే అని భక్తులు విశ్వసిస్తారు. స్త్రీలకు రుతుక్రమం ప్రకృతి సిద్ధంగా జరిగే ప్రక్రియ.. అదే మాదిరిగా కామాఖ్య అమ్మవారికి కూడా జరుగుతుండడం వింతగా అనిపించే నమ్మలేని నిజం. కామాఖ్య దేవాలయం భారతదేశంలోని అస్సాం రాష్ట్రం గౌహతిలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. లక్షల మంది భక్తలు ఈ కామాఖ్య అమ్మవారికి దర్శించుకుంటారు. వారి కోర్కెలను నెరవేర్చుకుంటారు.

కామాఖ్య దేవాలయం శివుడు, సతీదేవిల శృంగారభరితమైన ప్రదేశమని కొందరు భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఆ ప్రాంతానికి కామాఖ్య అని పేరు పెట్టారు. కామాఖ్యా దేవి రక్తస్రావం దేవతగా ప్రసిద్ధి చెందింది. ఈ రాతిలోనే కామాఖ్యాదేవి నివాసం ఉంటుందని చెబుతారు. ఈ శిలారూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యాదేవీకి నెలలో మూడు రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది. ఈ రోజుల్లో యోనిశిల నుండి ఎర్రని స్రావం వెలువడుతుంది. ఈ ఎర్రని స్రావం శక్తిపీఠం ముందున్న సౌభాగ్య కుండంలోని నీరుగా చెబుతారు.

 

దేవాలయానికి కొద్దిగా వెనుక భాగంలో మరో కుండం ఉంది. ఇది పార్వతి కుండం. ముందు కుండంలో స్నానం చేసిన భక్తులంతా ఈ పార్వతీకుండంలో కూడా స్నానం చేసి దర్శనానికి వెళుతారు. అంటే సౌభాగ్య కుండంలో స్నానం చేసిన భక్తులు ఆలయంలోని యోని శిలారూపాన్ని తాకి నమస్కరించుకుంటారు. అక్కడి యోని స్రావిత జలాన్ని తీర్థంగా సేవిస్తారు. ఈ కారణంగా ఆలయం వెనుక ఉన్న పార్వతి కుండంలో మరో సారి తలస్నానం చేస్తే మంచిదని ఇక్కడి పూజారులు చెబుతారు.

 

ఈ టెంపులో పూజలు కూడా ఎక్కువగా చేయిస్తుంటారు. పిల్లలు కాని వారు ఇక్కడకి వచ్చి పూజలు చేయిస్తే, వారికి సంతానం కలుగుతోందని నమ్మకం అట. అంతేకే వేల జంటలు ఇక్కడి వస్తుంటారని అక్కడి పూజారులు తెలిపారు. ఇలా పూజలు చేయించిన వారికి సంతానం కలిగిందని స్థానికులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -