Best Moles: ఆ ప్లేస్‌లో పుట్టుమచ్చలు ఉంటే లక్కేలక్కు!

Best Moles: ప్రతి మనిషికి పుట్టుమచ్చలు ఉండటం కామనే. మనిషిని గుర్తించడానికి పుట్టు మచ్చలు చాలా ఉపయోగ పడుతాయి. పోలీసులు కూడా పుట్టు మచ్చల ద్వారానే గురు తెలియని శవాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం భారతదేశంలో పుట్టుమచ్చల శాస్త్రం కూడా ఉంటుంది. పుట్టుకతో వస్తాయి కాబట్టి వాటిని పుట్టుమచ్చలు అని పిలుస్తారు. ఈ శాస్త్రం ప్రకారం శరీరంపై ఉన్న ప్రాంతాన్ని బట్టి వారి వ్యక్తిగత జీవితాన్ని అంచనా వేయొచ్చని పుట్టుమచ్చ శాస్త్ర నిపుణులు అయితే పుట్చుమచ్చలు శరీరంలోని కొన్ని భాగాల్లో ఉంటే మంచిదంటారు. మరి కొన్ని భాగాల్లో ఉంటే అరిష్టమని జ్యోతిష్యులు చెబుతుంటారు.

గడ్డం మీద ఉంటే: గడ్డం మీద పుట్టు మచ్చ ఉన్న వాళ్లు ఇతరులను బాధపెట్టరు. వారి దగ్గర ఎంత ఉన్నా దాంట్లోనే సరిపెట్టుకుని ఆనందంగా ఉంటారు.

నుదిటిపై ఉంటే: నుదిటిపై పుట్టుమచ్చ ఉంటే అధిక సంపద, విజయం, కీర్తి వీరిని వర్తిస్తాయని చెబుతారు.

చెంపపై ఉంటే: రెంపపై పుట్టుమచ్చ ఉన్నవాళ్లు సున్నితమైన మనసు కలవారు. ఏ విషయమైనా లోతుగా పరిశీలిస్తారు.

ముక్కు పై ఉంటే: ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే విపరీతమైన కోపం వచ్చేస్తుంది. కానీ ఎవరికైనా క్షణాల్లో దగ్గరవుతుతారు.

చాతిపై ఉంటే : చాతీపై పుట్టుమచ్చ ఉన్నవాళ్లు లగ్జరీ లైఫ్‌ నిగడపాలని అనుకుంటారు. కానీ బద్దకస్తులుగా ఉంటారట.

కంటిలో ఉంటే : పుట్టుమచ్చ కంట్లో ఉన్న వాళ్లకు›సంపాదన ఎక్కువగా ఉంటుంది. గర్వం కూడా ఉంటుంది. గర్వాన్ని తగ్గించుకుంటే మంచి పేరు సంపాదిస్తారట.

భుజం మీద: చాలా అందంగా ఉండి నిజం మాట్లాడతారు.

చేతులపై ఉంటే : సంతానం కొరకు ఎక్కువ ఆలోచిస్తారు. పిల్లలకు కావాల్సిన అన్ని అవసరాల సమకూరుస్తారట.

పాదం : ఈ స్థలంలో పుట్టుమచ్చ ఉన్నవారు కొత్త కొత్త ప్రదేశాలు అంటే ఇష్టపడతారు. ప్రేమ పెళ్లికి మొగ్గుచూపుతారట.

చెవిపై :చెవిపై పుట్టుమచ్చ ఉన్నవాళ్లు పూర్తిగా కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తారట. ఇలాంటి వాళ్లు మంచి స్వభావంతో ఉంటారని జ్యోతిష్యులు చెబుతుంటారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -